Title (Indic)ఆసపడి వాసులెంచ నది యేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆసపడి వాసులెంచ నది యేఁటికే పాసి వుండలేనివాఁడు పదరఁగ నేఁటికే (॥ఆస॥) తప్పక చూచినవాఁడు దండకు రావలెఁగాక చిప్పిలఁ గలలోనేసిగ్గులేఁటికే కొప్పు దువ్వినవాఁడు యిక్కువ లంటవలెఁగాక దప్పిదేరెమోవితోడ తలవంచ నేఁటికే (॥ఆస॥) మేలమాడినవాఁడు కామించి కూడవలెఁగాక యీలాగు సెలవినవ్వు లిపుడేఁటికే కాలుదొక్కిన వాఁ డిట్టె కరఁ గించవలఁగాక తాలిమితోసారెసారెఁ దలపోఁత లేఁటికే (॥ఆస॥) చేరి పెండ్లాడినవాఁడు చెనకఁగవలెఁగాక ఆరీతి కాఁకలనలయఁగ నేఁటికే వూరకె శ్రీ వేంకటేశుఁడొద్దికతో నన్నుఁ గూడె తారసిలె వలపులు తడఁబాటులేఁటికే English(||pallavi||) āsabaḍi vāsulĕṁcha nadi yem̐ṭige pāsi vuṁḍalenivām̐ḍu padaram̐ga nem̐ṭige (||āsa||) tappaga sūsinavām̐ḍu daṁḍagu rāvalĕm̐gāga sippilam̐ galalonesiggulem̐ṭige kŏppu duvvinavām̐ḍu yikkuva laṁṭavalĕm̐gāga dappiderĕmovidoḍa talavaṁcha nem̐ṭige (||āsa||) melamāḍinavām̐ḍu kāmiṁchi kūḍavalĕm̐gāga yīlāgu sĕlavinavvu libuḍem̐ṭige kāludŏkkina vām̐ ḍiṭṭĕ karam̐ giṁchavalam̐gāga tālimidosārĕsārĕm̐ dalabom̐ta lem̐ṭige (||āsa||) seri pĕṁḍlāḍinavām̐ḍu sĕnagam̐gavalĕm̐gāga ārīdi kām̐kalanalayam̐ga nem̐ṭige vūragĕ śhrī veṁkaḍeśhum̐ḍŏddigado nannum̐ gūḍĕ tārasilĕ valabulu taḍam̐bāḍulem̐ṭige