Title (Indic)ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆర్తుఁడ నేను నీకడ్డ మెందును లేదు మూర్తిత్రయాత్మక మొగిఁ గరుణించవే (॥ఆర్తుఁ॥) సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుఁడవు సర్వసర్వంసహాచక్రవర్తి నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి సర్వాపరాధములు క్షమియింపవే (॥ఆర్తుఁ॥) పరమాత్ముఁడవు నీవు పరంజ్యోతివి నీవు పరమ పరానంద పరమపురుషా కరిరాజవరదా కారుణ్యనిలయా శరణాగతుఁడ నన్ను సరిఁగావవే (॥ఆర్తుఁ॥) అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా అణిమాదివిభవా ఆద్యంతరహితా గణుతించి నాపాలఁ గలుగవే నీవు English(||pallavi||) ārdum̐ḍa nenu nīgaḍḍa mĕṁdunu ledu mūrditrayātmaga mŏgim̐ garuṇiṁchave (||ārdum̐||) sarvasākṣhivi nīvu sarvāṁtaraṁgum̐ḍavu sarvasarvaṁsahāsakravardi nirvāṇamūrdi nigamāṁtagīrdi sarvābarādhamulu kṣhamiyiṁpave (||ārdum̐||) paramātmum̐ḍavu nīvu paraṁjyodivi nīvu parama parānaṁda paramaburuṣhā karirājavaradā kāruṇyanilayā śharaṇāgadum̐ḍa nannu sarim̐gāvave (||ārdum̐||) aṇuvulobali nīvu ādimahattunu nīvu praṇuda śhrīveṁkaḍaprasuranilayā aṇimādivibhavā ādyaṁtarahidā gaṇudiṁchi nābālam̐ galugave nīvu