Title (Indic)ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు సారపు లౌకికవిమోచనమే ముక్తి (॥ఆర॥) మొగిఁ బుణ్యపాపవిముక్తియే ముక్తి వెగటుఁ బ్రపంచపువిముక్తే ముక్తి తగులు సంసారబంధవిముక్తే ముక్తి జగములోఁ గలుగు యాశాముక్తే ముక్తి (॥ఆర॥) కామక్రోధాదిసంగ విముక్తే ముక్తి వేమారు రుచులపై విముక్తే ముక్తి నాముల దేహభిమానపు ముక్తే ముక్తి పామెడి కోరికలసంపద ముక్తే ముక్తి (॥ఆర॥) ముందువెనకల కర్మమోచనమే ముక్తి అంది సుఖదుఃఖభయ ముక్తే ముక్తి కందువ శ్రీవేంకటేశుఁ గని యందే శరణని విందుల నితరసేవావిముక్తే ముక్తి English(||pallavi||) ārasi verŏgaso muktaḍugam̐gavaladu sārabu laugigavimosaname mukti (||āra||) mŏgim̐ buṇyabābavimuktiye mukti vĕgaḍum̐ brabaṁchabuvimukte mukti tagulu saṁsārabaṁdhavimukte mukti jagamulom̐ galugu yāśhāmukte mukti (||āra||) kāmakrodhādisaṁga vimukte mukti vemāru rusulabai vimukte mukti nāmula dehabhimānabu mukte mukti pāmĕḍi korigalasaṁpada mukte mukti (||āra||) muṁduvĕnagala karmamosaname mukti aṁdi sukhaduḥkhabhaya mukte mukti kaṁduva śhrīveṁkaḍeśhum̐ gani yaṁde śharaṇani viṁdula nidarasevāvimukte mukti