Title (Indic)ఆరగించి కూచున్నాఁ డల్లవాఁడె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆరగించి కూచున్నాఁ డల్లవాఁడె చేరువనే చూడరే లక్ష్మీనారసింహుఁడు (॥ఆర॥) ఇందిరనుఁ దొడమీఁద నిడుకొని కొలువిచ్చి అందపునవ్వులు చల్లీ నల్లవాఁడె చెందినమాణికముల శేషునిపడగెమీఁద చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు (॥ఆర॥) బంగారుమేడలోన పచ్చలగద్దియలమీఁద అంగనలయాట చూచీ నల్లవాఁడె రంగగుసొమ్ములతోడ రాజసపువిభవాల చెంగట నున్నుడా లక్ష్మీనారసింహుఁడు (॥ఆర॥) పెండెపుఁ బాదము చాఁచి పెసచి వొపాదము అండనే పూజలుగొనీ నల్లవాఁడె కొండల శ్రీవేంకటాద్రి గోరి యహోబలమున మొండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు English(||pallavi||) āragiṁchi kūsunnām̐ ḍallavām̐ḍĕ seruvane sūḍare lakṣhmīnārasiṁhum̐ḍu (||āra||) iṁdiranum̐ dŏḍamīm̐da niḍugŏni kŏluvichchi aṁdabunavvulu sallī nallavām̐ḍĕ sĕṁdinamāṇigamula śheṣhunibaḍagĕmīm̐da sĕṁdi varālichchī lakṣhmīnārasiṁhum̐ḍu (||āra||) baṁgārumeḍalona pachchalagaddiyalamīm̐da aṁganalayāḍa sūsī nallavām̐ḍĕ raṁgagusŏmmuladoḍa rājasabuvibhavāla sĕṁgaḍa nunnuḍā lakṣhmīnārasiṁhum̐ḍu (||āra||) pĕṁḍĕbum̐ bādamu sām̐si pĕsasi vŏbādamu aṁḍane pūjalugŏnī nallavām̐ḍĕ kŏṁḍala śhrīveṁkaḍādri gori yahobalamuna mŏṁḍugānu mĕrasī lakṣhmīnārasiṁhum̐ḍu