Title (Indic)ఆనేల పెట్టుమనేవు అంతలో నీపై WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనేల పెట్టుమనేవు అంతలో నీపై తానకమై నీకాపెకుఁ దగునిపుడు (॥ఆనే॥) మిగులాఁజక్కనిదైనమెలుఁత నొక్కతె నీకు తగిలించే వచ్చేవా తరి నావెంట మగువ నాదోమతెరమంచములో నున్నది నగనేల అప్పుడుగా నన్ను మెచ్చేది (॥ఆనే॥) నీ కాపెకుఁ బొందుసేసి నిన్ను సంతోసించఁజేసే వాకిచిచ మాఁటాడదు వలెనా నీకు దాకొనీ గుట్టుమానిసి తలుపు ముయ్యుము వేగ పైకొని యేల కొంకేవు పండీ నియ్యాన (॥ఆనే॥) నెలవై శ్రీవేంకటేశ నే నలమేలుమంగను యెలయించేనా నీకు నెవ్వరైరేమి అలరి ఇదివో అంటే అట్టె కాఁగిలించితివి కలసితి నేనే ఆపెగానా యీడను English(||pallavi||) ānela pĕṭṭumanevu aṁtalo nībai tānagamai nīgābĕgum̐ dagunibuḍu (||āne||) migulām̐jakkanidainamĕlum̐ta nŏkkadĕ nīgu tagiliṁche vachchevā tari nāvĕṁṭa maguva nādomadĕramaṁchamulo nunnadi naganela appuḍugā nannu mĕchchedi (||āne||) nī kābĕgum̐ bŏṁdusesi ninnu saṁtosiṁcham̐jese vāgisisa mām̐ṭāḍadu valĕnā nīgu dāgŏnī guṭṭumānisi talubu muyyumu vega paigŏni yela kŏṁkevu paṁḍī niyyāna (||āne||) nĕlavai śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu yĕlayiṁchenā nīgu nĕvvarairemi alari idivo aṁṭe aṭṭĕ kām̐giliṁchidivi kalasidi nene ābĕgānā yīḍanu