Title (Indic)ఆనతియ్యవయ్యా నీవా తరవాతిమాట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్యా నీవా తరవాతిమాట కానుకలు వట్టుకొని కాచుకున్నా రింతులు (॥॥) చట్టువంటినీమనసు సాదించరా దెవ్వరికి గట్టికొండలవంటివి కాంతచన్నులు గుట్టుతో మీరుండఁగా మీ గణము దెలియలేక చుట్టుక మొగమొగాలు చూచుకొనే రింతులు (॥॥) కాటుకవంటిది నీ చక్కనితిరుమణిచాయ కోటిచీఁకట్ల గుంపు కొమ్మతురుము నీటుతో మీరుండడఁగా మీనెపము లెరుఁగరాక తేటవడ లోలోఁ జింతించుకొనే రింతులు (॥॥) కొత్తచిగురువంటిది కోరినట్టినీవలపు చిత్తరువ్రాఁతవంటివి చెలిరతులు ఇత్తల శ్రీ వేంకటేశ ఇద్దరుఁ గూడితిరి పొత్తులసంతోసాలఁ బొదలేరు ఇంతులు English(||pallavi||) ānadiyyavayyā nīvā taravādimāḍa kānugalu vaṭṭugŏni kāsugunnā riṁtulu (||||) saṭṭuvaṁṭinīmanasu sādiṁcharā dĕvvarigi gaṭṭigŏṁḍalavaṁṭivi kāṁtasannulu guṭṭudo mīruṁḍam̐gā mī gaṇamu dĕliyalega suṭṭuga mŏgamŏgālu sūsugŏne riṁtulu (||||) kāḍugavaṁṭidi nī sakkanidirumaṇisāya koḍisīm̐kaṭla guṁpu kŏmmadurumu nīḍudo mīruṁḍaḍam̐gā mīnĕbamu lĕrum̐garāga teḍavaḍa lolom̐ jiṁtiṁchugŏne riṁtulu (||||) kŏttasiguruvaṁṭidi korinaṭṭinīvalabu sittaruvrām̐tavaṁṭivi sĕliradulu ittala śhrī veṁkaḍeśha iddarum̐ gūḍidiri pŏttulasaṁtosālam̐ bŏdaleru iṁtulu