Title (Indic)ఆనతియ్యవయ్యా నాతో నక్కడి సుద్దు లెల్లాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్యా నాతో నక్కడి సుద్దు లెల్లాను పూని నా కాఁగిట నిట్టె భోగించేవుగాని (॥ఆన॥) ఇందాఁకా నీ వాకె ఇంటనుండి వచ్చితివి విందు వెట్టెనా నీకు వేడుకతోను గందము పూసుకొంటివా కానవచ్చీ మేనను పొందుగ విడెమిచ్చెనా పుక్కిట నీకున్నది (॥ఆన॥) నానిన చెమటలతో నవ్వుతా నున్నాఁడవు పానుపు వరచెనా పాదాలొతైనా వీనులలో నేమైనా విన్నపాలు సేసెనా ఆనెనా చన్నులు వురమందు గురుతున్నది (॥ఆన॥) గరిమతో సంతోసాలు కానిపించీ నీమోమున సరసము లాడెనా చల్లెనా సేస యిరవై శ్రీవేంకటేశ యీడ నన్ను నేలితివి మరిగి తాఁ గూడెనా నీమనసులో నున్నది English(||pallavi||) ānadiyyavayyā nādo nakkaḍi suddu lĕllānu pūni nā kām̐giḍa niṭṭĕ bhogiṁchevugāni (||āna||) iṁdām̐kā nī vāgĕ iṁṭanuṁḍi vachchidivi viṁdu vĕṭṭĕnā nīgu veḍugadonu gaṁdamu pūsugŏṁṭivā kānavachchī menanu pŏṁduga viḍĕmichchĕnā pukkiḍa nīgunnadi (||āna||) nānina sĕmaḍalado navvudā nunnām̐ḍavu pānubu varasĕnā pādālŏdainā vīnulalo nemainā vinnabālu sesĕnā ānĕnā sannulu vuramaṁdu gurudunnadi (||āna||) garimado saṁtosālu kānibiṁchī nīmomuna sarasamu lāḍĕnā sallĕnā sesa yiravai śhrīveṁkaḍeśha yīḍa nannu nelidivi marigi tām̐ gūḍĕnā nīmanasulo nunnadi