Title (Indic)ఆనతియ్యవయ్య నాకు నందముగ వినేఁగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవయ్య నాకు నందముగ వినేఁగాని నానదుగదా నవ్వితే ననుపు గావలెను (॥ఆన॥) ఆసపడి నాయింటికి నటు సారెఁ బిలువఁగ వేసట గాదుగదా వింతలై నీకు వాసితో నీతొడ యెక్కి వలపులు చల్లఁగాను దోసము గాదుగదా తొడిఁబడ విపుడు (॥ఆన॥) వొగ్గి యందరిలో నిన్ను నొడివట్టి పెనఁగఁగా సిగ్గులు గావుగదా చేకొని నీకు అగ్గమై చన్నులుదాఁక నండ నేఁ గూచుండితేను యెగ్గయి తోఁచదుగదా ఇప్పుడు నీకు (॥ఆన॥) పలుమారు నే నీకు పాదము లొత్తఁగాను అలయిక గాదుగదా అంతలో నీకు యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను కలసితి మొగచాటు గాదుగదా నీకు English(||pallavi||) ānadiyyavayya nāgu naṁdamuga vinem̐gāni nānadugadā navvide nanubu gāvalĕnu (||āna||) āsabaḍi nāyiṁṭigi naḍu sārĕm̐ biluvam̐ga vesaḍa gādugadā viṁtalai nīgu vāsido nīdŏḍa yĕkki valabulu sallam̐gānu dosamu gādugadā tŏḍim̐baḍa vibuḍu (||āna||) vŏggi yaṁdarilo ninnu nŏḍivaṭṭi pĕnam̐gam̐gā siggulu gāvugadā segŏni nīgu aggamai sannuludām̐ka naṁḍa nem̐ gūsuṁḍidenu yĕggayi tom̐sadugadā ippuḍu nīgu (||āna||) palumāru ne nīgu pādamu lŏttam̐gānu alayiga gādugadā aṁtalo nīgu yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu kalasidi mŏgasāḍu gādugadā nīgu