Title (Indic)ఆనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను వూనిన వలపు నాకు నుంకువ లిచ్చితివా (॥ఆన॥) ప్రియములు నీవు చెప్పినయట్టయ్యీఁగాని నయగారినీచేఁతలు నమ్ముదునా దయదలఁచితే నిన్నుఁదగిలి మెచ్చేఁగాని నియతపునీగుణాలు నే నెరిఁగేదాననా (॥ఆన॥) దినదినకొత్తలెల్లాఁ దెలుసుకొనేఁగాని యెనసిన నీపొందిక నియ్యకొందునా చనవున మోవిచ్చేవు చవులుచూచేఁగాని ఘనమైన నీమా టతికడచేటిదాననా (॥ఆన॥) సరసములాడేవి సమ్మతులయ్యీఁగాని పురిగొన్ననీనేరుపు పొగడుదునా యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను గరిమ నన్నేలితివి కడు సంతోసింతునా English(||pallavi||) ānadiyyavalĕ nāgu naḍige nidivo ninnu vūnina valabu nāgu nuṁkuva lichchidivā (||āna||) priyamulu nīvu sĕppinayaṭṭayyīm̐gāni nayagārinīsem̐talu nammudunā dayadalam̐side ninnum̐dagili mĕchchem̐gāni niyadabunīguṇālu ne nĕrim̐gedānanā (||āna||) dinadinagŏttalĕllām̐ dĕlusugŏnem̐gāni yĕnasina nībŏṁdiga niyyagŏṁdunā sanavuna movichchevu savulusūsem̐gāni ghanamaina nīmā ṭadigaḍaseḍidānanā (||āna||) sarasamulāḍevi sammadulayyīm̐gāni purigŏnnanīnerubu pŏgaḍudunā yiravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu garima nannelidivi kaḍu saṁtosiṁtunā