Title (Indic)ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసుపేదను నేను (॥ఆన॥) కొలిచేమనే బంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ దెలిసేమనే జ్ఞానులు తెందేపలున్నారు తలఁచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో (॥ఆన॥) పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరట వినయపు నామనవి సనవులకు వేళ లెపుడు గలిగీనో (॥ఆన॥) వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు అన్నిటాను నీకాఁగిటిలోపల నలరీ నలమేల్మంగ యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలోనే పన్నిన నా మొక్కులు నీ కేబాగులఁ జేరినో English(||pallavi||) ānadiyyam̐gadave aṁduge kāsugunnām̐ḍanu pūnuga nīvĕṁta nerbarivainā bhuvi manasubedanu nenu (||āna||) kŏlisemane baṁṭlu nīgum̐ goḍānam̐goṭlu galaru ninnum̐ dĕlisemane jñānulu tĕṁdebalunnāru talam̐si varamulaḍigevāralu talavĕṁṭrugalaṁdaru vārĕ yila saṁdaḍilo nāgŏluvu yĕḍuvalĕ nĕkkīno (||āna||) panulagum̐ bālbaḍinavāru brahmādidevadalaḍa vinudulu seyam̐ dŏḍaṁginavĕ vedarāsulaḍa munugŏni dhyāniṁchuvāru munulĕṁdarainām̐ galaraḍa vinayabu nāmanavi sanavulagu veḽa lĕbuḍu galigīno (||āna||) vunnadidoḍuda ninnu mom̐suḍagu vunnāru garum̐ḍam̐ḍu śheṣhum̐ḍu nīgu anniḍānu nīgām̐giḍilobala nalarī nalamelmaṁga yĕnnam̐ga śhrīveṁkaḍeśhā nannunu yelidi viṁtaḍilone pannina nā mŏkkulu nī kebāgulam̐ jerino