Title (Indic)ఆనతిమ్ము నాతోను అనుమానము గలితే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతిమ్ము నాతోను అనుమానము గలితే నేనిక్కడనుండఁగానో నేమము చూపేవు (॥ఆన॥) ఆసపడి వచ్చివున్న అంగనఁ జేకొనకుంటే దోసమనే మాట నీవు తొల్లి వినవా వాసిగల బొమ్మచారివలెనే వూరకుండేవు బాసిచ్చి వచ్చితివో యేపడఁతికైనాను (॥ఆన॥) చుట్టుమై వచ్చినాపెకుఁ జోటియ్యకుండితేను వట్టి నిష్టూరముగాదా వరవాతను ముట్టుక తపముచేసే మునివలెనె వుండేవు గుట్టుతోడనుండేనని గుణముగైకొంటివో (॥ఆన॥) గరిమ మొక్క వచ్చిన కాంతఁ గౌఁగిలించకుంటే యెరవెరవై తోఁచదా యెవ్వరికైనా దొరవై శ్రీ వేంకటేశ గురునివలెనుండేవు సరినన్నేలితివి నాసమ్మతి గావలశో English(||pallavi||) ānadimmu nādonu anumānamu galide nenikkaḍanuṁḍam̐gāno nemamu sūbevu (||āna||) āsabaḍi vachchivunna aṁganam̐ jegŏnaguṁṭe dosamane māḍa nīvu tŏlli vinavā vāsigala bŏmmasārivalĕne vūraguṁḍevu bāsichchi vachchidivo yebaḍam̐tigainānu (||āna||) suṭṭumai vachchinābĕgum̐ joḍiyyaguṁḍidenu vaṭṭi niṣhṭūramugādā varavādanu muṭṭuga tabamusese munivalĕnĕ vuṁḍevu guṭṭudoḍanuṁḍenani guṇamugaigŏṁṭivo (||āna||) garima mŏkka vachchina kāṁtam̐ gaum̐giliṁchaguṁṭe yĕravĕravai tom̐sadā yĕvvarigainā dŏravai śhrī veṁkaḍeśha gurunivalĕnuṁḍevu sarinannelidivi nāsammadi gāvalaśho