Title (Indic)ఆనతిచ్చేవు నాతోను ఆపెమీఁది మోహమున WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతిచ్చేవు నాతోను ఆపెమీఁది మోహమున కానీవయ్య తన సిగ్గు కాముకుఁ డెరుఁగునా (॥ఆన॥) యితవరి యయినసతి యేమాఁటలాడినాను తతితో మగని కవి తలఁపులౌను రతివేళ నెటువలె రాజసము చూపినాను కతలుఁ గారణములై కడువేడు కౌను (॥ఆన॥) చుట్టమైనకాంత యంత సొలసి చూచినాను దట్టమై విభుని కవె తలఁపులౌను ముట్టి చెనకేటివేళ మొనగో రెంతమోసినా గట్టిగా మేన మదనకళలెల్ల రేఁచును (॥ఆన॥) తగువైనవనిత యెంత గుబ్బల నొత్తినాను తగుమర్మములు సోఁకి తలఁపులౌను నిగిడి శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి తగిలి యనియు నీవీఁ దారుకాణలౌను English(||pallavi||) ānadichchevu nādonu ābĕmīm̐di mohamuna kānīvayya tana siggu kāmugum̐ ḍĕrum̐gunā (||āna||) yidavari yayinasadi yemām̐ṭalāḍinānu tadido magani kavi talam̐pulaunu radiveḽa nĕḍuvalĕ rājasamu sūbinānu kadalum̐ gāraṇamulai kaḍuveḍu kaunu (||āna||) suṭṭamainagāṁta yaṁta sŏlasi sūsinānu daṭṭamai vibhuni kavĕ talam̐pulaunu muṭṭi sĕnageḍiveḽa mŏnago rĕṁtamosinā gaṭṭigā mena madanagaḽalĕlla rem̐sunu (||āna||) taguvainavanida yĕṁta gubbala nŏttinānu tagumarmamulu som̐ki talam̐pulaunu nigiḍi śhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi tagili yaniyu nīvīm̐ dārugāṇalaunu