Title (Indic)ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము నాని నాని వలపులు నాఁటుకొనెనా (॥ఆన॥) సొలసి సొలసి నీకు సుద్దులెల్లాఁ జెప్ప పంపీ చెలియమాఁటలు నేఁడు చెవిఁ బట్టెనా యెలమి నెదురుచూచి యెప్పుడు వత్తువో యంటా తలఁపులోపల నీకు దయవుట్టెనా (॥ఆన॥) బడిబడిఁ దనరూపు పటమున వ్రాసి పంపీ జడియ నీవలవులు సరివచ్చెనా అడిల మంపఁగాను యాసపడి వున్నది యెడయ కాపెకదకు నేతెంచేవా (॥ఆన॥) వినయాన నీకు నుంటవింట గప్పుర మంపీ తనిసి నీ కింతట సంతన మాయనా యెనసితిని శ్రీ వేంకటేశ యీ కెలమేల్మంగ చెనకీ నిన్నియును నీచిత్తము వచ్చెనా English(||pallavi||) ānadīvayyā nīvu āgĕgu vinnaviṁchemu nāni nāni valabulu nām̐ṭugŏnĕnā (||āna||) sŏlasi sŏlasi nīgu suddulĕllām̐ jĕppa paṁpī sĕliyamām̐ṭalu nem̐ḍu sĕvim̐ baṭṭĕnā yĕlami nĕdurusūsi yĕppuḍu vattuvo yaṁṭā talam̐pulobala nīgu dayavuṭṭĕnā (||āna||) baḍibaḍim̐ danarūbu paḍamuna vrāsi paṁpī jaḍiya nīvalavulu sarivachchĕnā aḍila maṁpam̐gānu yāsabaḍi vunnadi yĕḍaya kābĕgadagu nedĕṁchevā (||āna||) vinayāna nīgu nuṁṭaviṁṭa gappura maṁpī tanisi nī kiṁtaḍa saṁtana māyanā yĕnasidini śhrī veṁkaḍeśha yī kĕlamelmaṁga sĕnagī ninniyunu nīsittamu vachchĕnā