Title (Indic)ఆనతీవయ్యా నాకు నది వినవేడుకయ్యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్యా నాకు నది వినవేడుకయ్యీ సోనగాఁ గురిసీ నీమై సొరదిఁ బెంజెమట (॥॥) పొట్టం బొరుగున నీవు పొందులు సేసేయందుకు నెట్టన నే నవ్వినదే నెపమాయను ఇట్టె గుట్టుననుండితే నేమనఁ గలవాఁడవు వుట్టిపడీ వలపులవుద్యేగాలెల్లను (॥॥) సిరులనాపై నీవు సేసలు వెట్టేయందుకు సరసము నేనాడుటే సందాయను తెరలో నుండితే నెట్టు ద్రిష్టించఁ గలవాఁడవు పెరిగీని యడియాసప్రియము లన్నియును (॥॥) మలయుచు నీవు నన్ను మన్నించేయందుకు సొలసి నేఁ గూడినదే చొప్పాయను తలవంచితే నెవ్వరిఁ దడవఁ గలవాఁడవు మొలచీ శ్రీ వేంకటేశ మోహనములెల్లను English(||pallavi||) ānadīvayyā nāgu nadi vinaveḍugayyī sonagām̐ gurisī nīmai sŏradim̐ bĕṁjĕmaḍa (||||) pŏṭṭaṁ bŏruguna nīvu pŏṁdulu seseyaṁdugu nĕṭṭana ne navvinade nĕbamāyanu iṭṭĕ guṭṭunanuṁḍide nemanam̐ galavām̐ḍavu vuṭṭibaḍī valabulavudyegālĕllanu (||||) sirulanābai nīvu sesalu vĕṭṭeyaṁdugu sarasamu nenāḍuḍe saṁdāyanu tĕralo nuṁḍide nĕṭṭu driṣhṭiṁcham̐ galavām̐ḍavu pĕrigīni yaḍiyāsapriyamu lanniyunu (||||) malayusu nīvu nannu manniṁcheyaṁdugu sŏlasi nem̐ gūḍinade sŏppāyanu talavaṁchide nĕvvarim̐ daḍavam̐ galavām̐ḍavu mŏlasī śhrī veṁkaḍeśha mohanamulĕllanu