Title (Indic)ఆనతీవయ్య యేమిటా నడ్డము లేదు నేఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్య యేమిటా నడ్డము లేదు నేఁడు నేను నీకీ వూడిగాలు నేరుచుకొనేను (॥ఆన॥) కొంత గొంత నీ నిలువుఁ గొప్పు జారివున్నదిదె పంతమున నెవ్వతైనాఁ బట్టి తీసెనో పొంతనె యెదుగాను నీ పుక్కిటఁ దమ్మ వున్నది అంతరంగమైనచోట నాదాయము వచ్చెనో (॥ఆన॥) తొలుతే నీ పచ్చడము తొప్పఁ దోఁగి వున్న దిదె నిలుచుండఁగా నాపె పన్నీరు చల్లెనో అలసి బుసకొట్టేవు అక్కడివారు నిన్ను బలిమిఁ జెప్పఁ గారానిపనులు సేయించిరో (॥ఆన॥) యీ రీతిఁ బూవుల దండ లిన్ని నీమెడ నున్నవి పోరానివారే నీకు బూజ సేసిరో చేరి యలమేల్మంగను శ్రీ వేంకటేశ కూడితి వారసి బుద్ది చెప్పిరో అందరూనుఁ దగరు English(||pallavi||) ānadīvayya yemiḍā naḍḍamu ledu nem̐ḍu nenu nīgī vūḍigālu nerusugŏnenu (||āna||) kŏṁta gŏṁta nī niluvum̐ gŏppu jārivunnadidĕ paṁtamuna nĕvvadainām̐ baṭṭi tīsĕno pŏṁtanĕ yĕdugānu nī pukkiḍam̐ damma vunnadi aṁtaraṁgamainasoḍa nādāyamu vachchĕno (||āna||) tŏlude nī pachchaḍamu tŏppam̐ dom̐gi vunna didĕ nilusuṁḍam̐gā nābĕ pannīru sallĕno alasi busagŏṭṭevu akkaḍivāru ninnu balimim̐ jĕppam̐ gārānibanulu seyiṁchiro (||āna||) yī rīdim̐ būvula daṁḍa linni nīmĕḍa nunnavi porānivāre nīgu būja sesiro seri yalamelmaṁganu śhrī veṁkaḍeśha kūḍidi vārasi buddi sĕppiro aṁdarūnum̐ dagaru