Title (Indic)ఆనతీవయ్య నీ వేళలవి యెట్టో యెఱుఁగము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్య నీ వేళలవి యెట్టో యెఱుఁగము వూని నిన్ను విచారించ కూరకుండరాదు (॥॥) బత్తి తో నెవ్వతె మీఁది పరాకున నున్నాఁడవో హత్తి నే నీ వేళ మాటలాడ వచ్చునా కొత్తగా నే యింతిఁ బిల్చుకొనే నని వున్నాఁడవో యెత్తి నీ తెర దీసి నిన్నిటు చూడవచ్చునా (॥॥) మఱి యెవ్వతె కీ పొద్దు మాట యిచ్చుకున్నాఁడవో యెఱుఁగక నీకు వీడె మియ్య వచ్చునా గుఱిగా నేసతిరాక గోరుక నీ వున్నాఁడవో తఱితో నిప్పుడు నీ పాదము లొత్త వచ్చునా (॥॥) అరుదుగా నెవ్వతెకు నాసపడి వున్నాఁడవో వరుసకు నే నీతో నవ్వఁగవచ్చునా ఇరవై శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి మరిగి నీ గుణములు మఱవఁగ వచ్చునా English(||pallavi||) ānadīvayya nī veḽalavi yĕṭṭo yĕṟum̐gamu vūni ninnu visāriṁcha kūraguṁḍarādu (||||) batti to nĕvvadĕ mīm̐di parāguna nunnām̐ḍavo hatti ne nī veḽa māḍalāḍa vachchunā kŏttagā ne yiṁtim̐ bilsugŏne nani vunnām̐ḍavo yĕtti nī tĕra dīsi ninniḍu sūḍavachchunā (||||) maṟi yĕvvadĕ kī pŏddu māḍa yichchugunnām̐ḍavo yĕṟum̐gaga nīgu vīḍĕ miyya vachchunā guṟigā nesadirāga goruga nī vunnām̐ḍavo taṟido nippuḍu nī pādamu lŏtta vachchunā (||||) arudugā nĕvvadĕgu nāsabaḍi vunnām̐ḍavo varusagu ne nīdo navvam̐gavachchunā iravai śhrī veṁkaḍeśha yiṭṭe nannu nelidivi marigi nī guṇamulu maṟavam̐ga vachchunā