Title (Indic)ఆనతీవయ్య నాతోను అల్లదివో చెలియ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆనతీవయ్య నాతోను అల్లదివో చెలియ పూని నీ మన్నన లెట్టు పొసఁగించేవయ్యా (॥ఆన॥) దప్పిదేరే మోముతోడ తరుణి నిన్నుఁ బిలిచీ అప్పుడాడిన మాట కేమంటివయ్యా చిప్పిలుఁ జెమటతోడ చేసన్నసేసి నందుకు ఇప్పుడు నీచిత్తములో నెట్టున్నదయ్యా (॥ఆన॥) సిగ్గుతోడఁ దలవంచీ చెలులచేతనంపిన అగ్గపుఁగానుక లేమ నందితివయ్య వెగ్గళించి ఆపె నిన్ను వేసినపూల చెండు దగ్గరి నీకళ యేడ దాఁకెనయ్యా (॥ఆన॥) కొంగువట్టి తీసి తానే కూరిమి గొసరితేను వుంగిటి నీమొగ మెట్టోడివయ్య ఇంగితాన శ్రీ వేంకటేశ కూడితి రిద్దరు పొంగేటి వలపు లెందు వోసేవయ్యా English(||pallavi||) ānadīvayya nādonu alladivo sĕliya pūni nī mannana lĕṭṭu pŏsam̐giṁchevayyā (||āna||) dappidere momudoḍa taruṇi ninnum̐ bilisī appuḍāḍina māḍa kemaṁṭivayyā sippilum̐ jĕmaḍadoḍa sesannasesi naṁdugu ippuḍu nīsittamulo nĕṭṭunnadayyā (||āna||) siggudoḍam̐ dalavaṁchī sĕlulasedanaṁpina aggabum̐gānuga lema naṁdidivayya vĕggaḽiṁchi ābĕ ninnu vesinabūla sĕṁḍu daggari nīgaḽa yeḍa dām̐kĕnayyā (||āna||) kŏṁguvaṭṭi tīsi tāne kūrimi gŏsaridenu vuṁgiḍi nīmŏga mĕṭṭoḍivayya iṁgidāna śhrī veṁkaḍeśha kūḍidi riddaru pŏṁgeḍi valabu lĕṁdu vosevayyā