Title (Indic)ఆన తియ్యవయ్యా మాకు నామేలు వినేముగాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆన తియ్యవయ్యా మాకు నామేలు వినేముగాని కోమలికిఁ బొంతనాలు గూడెనా నీకు (॥ఆన॥) చలముగొని యాపెను సారెసారెఁ జూచేవు మలసి నీకుఁ బెండ్లాడ మనసయ్యీనా చెలరేఁగి యప్పటిని చేయి మీఁదవేసేవు యెలమితో వారివారు ఇచ్చిరా నీకు (॥ఆన॥) తీపులమోవినిండ తేనియలు జొబ్బిలీవి ఆపెకు నీకును మాట లందెనా నేఁడు కాఁపురము సేసేనంటా కాచుకొనివున్నాఁడవు ఆపాటి చుట్టరికమ లాయనా నీకు (॥ఆన॥) పానుపుపై నాపెచేతఁ బాదా లొత్తించు కొనేవు అనుకొని బువ్వము పొత్తబ్బెనా మీకు పూని శ్రీవేంకటేశ్వర పొంచి నన్ను నేలితివి మేనరికా లిద్దరికి మెరసెనా ఇపుడు English(||pallavi||) āna tiyyavayyā māgu nāmelu vinemugāni komaligim̐ bŏṁtanālu gūḍĕnā nīgu (||āna||) salamugŏni yābĕnu sārĕsārĕm̐ jūsevu malasi nīgum̐ bĕṁḍlāḍa manasayyīnā sĕlarem̐gi yappaḍini seyi mīm̐davesevu yĕlamido vārivāru ichchirā nīgu (||āna||) tībulamoviniṁḍa teniyalu jŏbbilīvi ābĕgu nīgunu māḍa laṁdĕnā nem̐ḍu kām̐puramu sesenaṁṭā kāsugŏnivunnām̐ḍavu ābāḍi suṭṭarigama lāyanā nīgu (||āna||) pānububai nābĕsedam̐ bādā lŏttiṁchu kŏnevu anugŏni buvvamu pŏttabbĕnā mīgu pūni śhrīveṁkaḍeśhvara pŏṁchi nannu nelidivi menarigā liddarigi mĕrasĕnā ibuḍu