Title (Indic)ఆఁటది రాజ్యమేలితే అది మంచిదేకాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది రాజ్యమేలితే అది మంచిదేకాదా చాటువగా మాకు నిన్ను సాదించనేఁటికి (॥ఆఁట॥) పీఁటపై నున్న దాపె ప్రియుఁడవు నిలుచుండి మాఁటలాడే వాపెతోను మంచిదేకాదా గాఁటముగా వంచ నెంత గలిగి మెలఁగినాను యీటున నీవే బదే వేమినననేఁటికి (॥ఆఁట॥) పడఁతి పవ్వళించఁగా పాదాలకాడ నుండి మడిచిచ్చే వాకు నీవు మంచిదేకాదా వుడుగక నీవెంత వూడిగాలు నేర్చినాను కడు నీకే లాభమయ్యీ కాదనఁగనేఁటికి (॥ఆఁట॥) వురముపై నున్న దాకెవొగి నిట్టే కిందుపడి మరులు గొంటివి నీవు మంచిదేకాదా ఇరవై శ్రీవేంకటేశ యెంత మోపెత్తుకొనినా మరిగి నన్నేలితివి మచ్చరించనేఁటికి English(||pallavi||) ām̐ṭadi rājyamelide adi maṁchidegādā sāḍuvagā māgu ninnu sādiṁchanem̐ṭigi (||ām̐ṭa||) pīm̐ṭabai nunna dābĕ priyum̐ḍavu nilusuṁḍi mām̐ṭalāḍe vābĕdonu maṁchidegādā gām̐ṭamugā vaṁcha nĕṁta galigi mĕlam̐ginānu yīḍuna nīve bade veminananem̐ṭigi (||ām̐ṭa||) paḍam̐ti pavvaḽiṁcham̐gā pādālagāḍa nuṁḍi maḍisichche vāgu nīvu maṁchidegādā vuḍugaga nīvĕṁta vūḍigālu nersinānu kaḍu nīge lābhamayyī kādanam̐ganem̐ṭigi (||ām̐ṭa||) vuramubai nunna dāgĕvŏgi niṭṭe kiṁdubaḍi marulu gŏṁṭivi nīvu maṁchidegādā iravai śhrīveṁkaḍeśha yĕṁta mobĕttugŏninā marigi nannelidivi machchariṁchanem̐ṭigi