Title (Indic)ఆఁటది గర్వించితేను అంతట మట్టెరఁగదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటది గర్వించితేను అంతట మట్టెరఁగదు పాటించి యాతఁడు నీకే పాలుపడె నటవే (॥ఆట॥) వంతుపెట్టుకొని పతివద్దఁ గాచుకుందానవు యెంతగద్దే నీచనవు ఇందరికంటే ఇంతలోనే చెవిలోన నేకతాలూ నాడేవు చింతదీర నీమాటే సేసునటే యీతఁడు (॥ఆట॥) పరగ నాతనికి నీపచ్చడము గప్పేవు పొరుగున నెన్నటిపొందులే నీకు తెరవేసుకొనుచు చేతికి విడెమూ నిచ్చేవు సిరులఁబనులు నీకుఁ జెప్పెనటే యాతఁడు (॥ఆట॥) కలసిమెలసి నీవు కందువలు చెప్పేవు చెలరేఁగి నీకు బాస సేసెనటవే యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె తెలిపి నిన్నిట్లానే దిద్దెనటే యీతఁడు English(||pallavi||) ām̐ṭadi garviṁchidenu aṁtaḍa maṭṭĕram̐gadu pāḍiṁchi yādam̐ḍu nīge pālubaḍĕ naḍave (||āḍa||) vaṁtubĕṭṭugŏni padivaddam̐ gāsuguṁdānavu yĕṁtagadde nīsanavu iṁdarigaṁṭe iṁtalone sĕvilona negadālū nāḍevu siṁtadīra nīmāḍe sesunaḍe yīdam̐ḍu (||āḍa||) paraga nādanigi nībachchaḍamu gappevu pŏruguna nĕnnaḍibŏṁdule nīgu tĕravesugŏnusu sedigi viḍĕmū nichchevu sirulam̐banulu nīgum̐ jĕppĕnaḍe yādam̐ḍu (||āḍa||) kalasimĕlasi nīvu kaṁduvalu sĕppevu sĕlarem̐gi nīgu bāsa sesĕnaḍave yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ tĕlibi ninniṭlāne diddĕnaḍe yīdam̐ḍu