Title (Indic)ఆఁటదానిఁ గంటేఁజాలు అట్టె లోలుఁడ వౌదువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదానిఁ గంటేఁజాలు అట్టె లోలుఁడ వౌదువు మాఁటల నాపెతోఁ గూడ మరచివచ్చితివా (॥ఆఁట॥) తతితోడ నీ విప్పుడు తన ఇంటికి రావంటా సతి నిన్నుఁ గొసరీని సముకానను మితిలేనివాడలెల్లా మెట్టివచ్చితి విందాఁకా వెతదీర నాడకుఁబో వేళ లేదాయనా (॥ఆఁట॥) సారెఁ దనతో సరసములాడవైతివంటా వూరకె తప్పులెంచీ నీవొద్దనే వుండి నేరుపుతో కతలెల్లా నేరిచినవాఁడవు యీరీతి నీపెవలపు యెరఁగలేవైతివా (॥ఆఁట॥) అన్నిటాను తన్నుఁగూడి ఆయా లంటవైతివంటా కన్నుల సన్నలు చేసీ కాఁగిటిలోను ఇన్నిటా శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు తిన్నఁగా నాపెవలపు తెలుసుకోవైతివా English(||pallavi||) ām̐ṭadānim̐ gaṁṭem̐jālu aṭṭĕ lolum̐ḍa vauduvu mām̐ṭala nābĕdom̐ gūḍa marasivachchidivā (||ām̐ṭa||) tadidoḍa nī vippuḍu tana iṁṭigi rāvaṁṭā sadi ninnum̐ gŏsarīni samugānanu midilenivāḍalĕllā mĕṭṭivachchidi viṁdām̐kā vĕdadīra nāḍagum̐bo veḽa ledāyanā (||ām̐ṭa||) sārĕm̐ danado sarasamulāḍavaidivaṁṭā vūragĕ tappulĕṁchī nīvŏddane vuṁḍi nerubudo kadalĕllā nerisinavām̐ḍavu yīrīdi nībĕvalabu yĕram̐galevaidivā (||ām̐ṭa||) anniḍānu tannum̐gūḍi āyā laṁṭavaidivaṁṭā kannula sannalu sesī kām̐giḍilonu inniḍā śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu tinnam̐gā nābĕvalabu tĕlusugovaidivā