Title (Indic)ఆఁటదానికి పతితో నంతచెల్లునా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదానికి పతితో నంతచెల్లునా చీటికి మాటికి యంతసేసేవె నీవు (॥ఆఁట॥) పట్టినదె చల మని పంతములె నెరుపేవు అట్టె యాతని ప్రియము లంగవించవు చిట్టకాలు వద్దనిన చెలుల మాటలు చెవిఁ బెట్టవు నీకుఁ దగిన బీరములె కాని (॥ఆఁట॥) ఆడినదె మాటసేసి యట్టె నిలువఁ బెట్టేవు జోడుగా నాతని మాట చొరనియ్యవు తోడనె నే మిద్దరి చేతులుఁ బట్టికూరిచిన కూడియుఁ గూడవు నీ గుణములె కాని (॥ఆఁట॥) మొదలివొట్టుకు నీ మొనలు చూపేవు గాని అదనైన మీఁద నింక నటు మెచ్చవు యిదివో శ్రీ వెంకటేశుఁ డిదె నన్నుఁ గూడినాఁడు చదురు లింకా నీవు సాదించేవు గాని English(||pallavi||) ām̐ṭadānigi padido naṁtasĕllunā sīḍigi māḍigi yaṁtasesevĕ nīvu (||ām̐ṭa||) paṭṭinadĕ sala mani paṁtamulĕ nĕrubevu aṭṭĕ yādani priyamu laṁgaviṁchavu siṭṭagālu vaddanina sĕlula māḍalu sĕvim̐ bĕṭṭavu nīgum̐ dagina bīramulĕ kāni (||ām̐ṭa||) āḍinadĕ māḍasesi yaṭṭĕ niluvam̐ bĕṭṭevu joḍugā nādani māḍa sŏraniyyavu toḍanĕ ne middari sedulum̐ baṭṭigūrisina kūḍiyum̐ gūḍavu nī guṇamulĕ kāni (||ām̐ṭa||) mŏdalivŏṭṭugu nī mŏnalu sūbevu gāni adanaina mīm̐da niṁka naḍu mĕchchavu yidivo śhrī vĕṁkaḍeśhum̐ ḍidĕ nannum̐ gūḍinām̐ḍu saduru liṁkā nīvu sādiṁchevu gāni