Title (Indic)ఆఁటదాని యాసోదాన కలవి లేదనియేటి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని యాసోదాన కలవి లేదనియేటి మాట నీవల్లఁ గంటిమి మతక మేమిటికి (॥ఆఁట॥) మోవిపండుతీపులతో ముంచి తేనెలు గారఁగా రావిపండుచవు లౌనా రతివేళను కైవమై నా కితఁడు కామించి తా నుండఁగాను యీవల నీ వేల యెలయించఁగ వచ్చేవే (॥ఆఁట॥) తమ్మిపూవు తేఁటికి నితావులై తా నుండఁగాను తుమ్మిపూవు చెప్పి దోసము గాదా నమ్మించి యీ రమణుఁడు నావద్దనే వుండఁగాను యిమ్ముల సన్న లితని కేల సేసేవే (॥ఆఁట॥) అంచకల్పకముపై నమరి క్రీడింపఁగాను కొంచయేతెంచి తా నందఁ గూచుండినట్లు యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిట్టేఁ నన్నుఁ గూడఁగాను పంచ నీవుఁ గూడి యెంత బాఁతిపడేవే English(||pallavi||) ām̐ṭadāni yāsodāna kalavi ledaniyeḍi māḍa nīvallam̐ gaṁṭimi madaga memiḍigi (||ām̐ṭa||) movibaṁḍudībulado muṁchi tenĕlu gāram̐gā rāvibaṁḍusavu launā radiveḽanu kaivamai nā kidam̐ḍu kāmiṁchi tā nuṁḍam̐gānu yīvala nī vela yĕlayiṁcham̐ga vachcheve (||ām̐ṭa||) tammibūvu tem̐ṭigi nidāvulai tā nuṁḍam̐gānu tummibūvu sĕppi dosamu gādā nammiṁchi yī ramaṇum̐ḍu nāvaddane vuṁḍam̐gānu yimmula sanna lidani kela seseve (||ām̐ṭa||) aṁchagalbagamubai namari krīḍiṁpam̐gānu kŏṁchayedĕṁchi tā naṁdam̐ gūsuṁḍinaṭlu yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭem̐ nannum̐ gūḍam̐gānu paṁcha nīvum̐ gūḍi yĕṁta bām̐tibaḍeve