Title (Indic)ఆఁటదాని చేతిదే ఆయపుఁ గాఁపురమెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని చేతిదే ఆయపుఁ గాఁపురమెల్లా నీటున నీకన్నియును నేరుపఁగ వలదా (॥ఆఁట॥) నిన్ను దూరఁదగవా నీతోఁ బొందుసేసిన వన్నెల సతుల దూరవచ్చుఁగాక మిన్నక దొరతనాన మించి మత్తుడవై యుంటే తినఁగాఁ దామెల్లా నిన్ను తిద్ది తీర్చవలదా (॥ఆఁట॥) అలుగ నీతోఁ దగునా అండనున్న నీ సతుల నలిని యేమిసేసినా నమరుఁగాక కలసేటి జవ్వనపు గజరు నీకుఁ బట్టితే తెలిపి నిన్నుఁ జాయకుఁదెచ్చుకొనవలదా (॥ఆఁట॥) కొంగవట్టి నీగుణాలు కొసరితే నమరునా సంగడి నీ ఇంతులఁ గొసరుట గాక ముంగిట శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి వుంగిటిగొన్న నిన్నుఁ దామొరయఁగ వలదా English(||pallavi||) ām̐ṭadāni sedide āyabum̐ gām̐puramĕllā nīḍuna nīganniyunu nerubam̐ga valadā (||ām̐ṭa||) ninnu dūram̐dagavā nīdom̐ bŏṁdusesina vannĕla sadula dūravachchum̐gāga minnaga dŏradanāna miṁchi mattuḍavai yuṁṭe tinam̐gām̐ dāmĕllā ninnu tiddi tīrsavaladā (||ām̐ṭa||) aluga nīdom̐ dagunā aṁḍanunna nī sadula nalini yemisesinā namarum̐gāga kalaseḍi javvanabu gajaru nīgum̐ baṭṭide tĕlibi ninnum̐ jāyagum̐dĕchchugŏnavaladā (||ām̐ṭa||) kŏṁgavaṭṭi nīguṇālu kŏsaride namarunā saṁgaḍi nī iṁtulam̐ gŏsaruḍa gāga muṁgiḍa śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi vuṁgiḍigŏnna ninnum̐ dāmŏrayam̐ga valadā