Title (Indic)ఆఁటదాని కింతగద్దా అగడు సేసెఁగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని కింతగద్దా అగడు సేసెఁగాక జూటరి దీని విద్యలు చూడరమ్మా సతులు (॥ఆఁట॥) చిగురుఁ బెదవిమీఁద చిన్నిముద్దుమాఁట లాడీ మగనితో నించుకంతా మరఁగలేక తెగనివలపు చల్లి తీగె నవ్వులు నవ్వీ సొగిసే దీవి వుదుటు చూడఁ గొత్తలాయను (॥ఆఁట॥) తమ్మికన్నులు దెరచి తళుఁకుఁ జూపులఁ జూచీ కమ్మటఁ బతి యెదుట గర్వమునను సొమ్మలెల్లాఁ జూపుకొంటా జోలి మొక్కులు మొక్కీ యెమ్మెలదీనివేసాల కేమందు నేను (॥ఆఁట॥) కావరపు గుబ్బలు సోఁకఁగ సేవలెల్లాఁజేసీ శ్రీవేంకటేశుఁ డెదుట సిగ్గువడక వావితో నన్నితఁ డేలె వట్టిసన్నలు తాఁజేసీ భావించి దీని గజరు పచ్చిఁ దోచె నిపుడు English(||pallavi||) ām̐ṭadāni kiṁtagaddā agaḍu sesĕm̐gāga jūḍari dīni vidyalu sūḍarammā sadulu (||ām̐ṭa||) sigurum̐ bĕdavimīm̐da sinnimuddumām̐ṭa lāḍī maganido niṁchugaṁtā maram̐galega tĕganivalabu salli tīgĕ navvulu navvī sŏgise dīvi vuduḍu sūḍam̐ gŏttalāyanu (||ām̐ṭa||) tammigannulu dĕrasi taḽum̐kum̐ jūbulam̐ jūsī kammaḍam̐ badi yĕduḍa garvamunanu sŏmmalĕllām̐ jūbugŏṁṭā joli mŏkkulu mŏkkī yĕmmĕladīnivesāla kemaṁdu nenu (||ām̐ṭa||) kāvarabu gubbalu som̐kam̐ga sevalĕllām̐jesī śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa sigguvaḍaga vāvido nannidam̐ ḍelĕ vaṭṭisannalu tām̐jesī bhāviṁchi dīni gajaru pachchim̐ dosĕ nibuḍu