Title (Indic)ఆఁటదాని కింత యేల అంతలోని పనికిఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని కింత యేల అంతలోని పనికిఁగా పూఁటవూఁటఁ దనతో నేఁ బోరనేలా (॥ఆఁట॥) వలవని పతికె వలచే యా రోఁత లేల మలసెటి విరహాగ్నిమంట లేదా పలుకని పతితోడఁ బలుకఁగ నది యేల ములుగుచుఁ బానుపుపై మోనము లేదా (॥ఆఁట॥) యింటికిరానిపతికి నెదురు వోవఁగ నేల జంటయి మునుఁగఁ జింతాజలధి లేదా నంటులేని పతితోడ నవ్వఁబో నంత యేల అంటరాని చిగురాకుటమ్ములు లేవా (॥ఆఁట॥) కడదొక్కె పతితోడఁ గాఁగిలించ నిది యేల ముడిచి యవ్వలి మారుమోము లేదా అడరి శ్రీవెంకటేశుఁ దాదరించి నన్నుఁ గూడె సడి వూరకే యంటి సరసము లేదా English(||pallavi||) ām̐ṭadāni kiṁta yela aṁtaloni panigim̐gā pūm̐ṭavūm̐ṭam̐ danado nem̐ boranelā (||ām̐ṭa||) valavani padigĕ valase yā rom̐ta lela malasĕḍi virahāgnimaṁṭa ledā palugani padidoḍam̐ balugam̐ga nadi yela mulugusum̐ bānububai monamu ledā (||ām̐ṭa||) yiṁṭigirānibadigi nĕduru vovam̐ga nela jaṁṭayi munum̐gam̐ jiṁtājaladhi ledā naṁṭuleni padidoḍa navvam̐bo naṁta yela aṁṭarāni sigurāguḍammulu levā (||ām̐ṭa||) kaḍadŏkkĕ padidoḍam̐ gām̐giliṁcha nidi yela muḍisi yavvali mārumomu ledā aḍari śhrīvĕṁkaḍeśhum̐ dādariṁchi nannum̐ gūḍĕ saḍi vūrage yaṁṭi sarasamu ledā