Title (Indic)ఆఁటదాని గోడు చూడరయ్యో యీ మగవారి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని గోడు చూడరయ్యో యీ మగవారి- కేఁటిబుద్ది వుట్టించె నీ సడపుఁ గర్మము (॥ఆఁట॥) యిరవెరఁగము మమ్మునింత సేసేవని నీకే కరఁగుదు నీమోము గన్నదాఁకాను మరిగినయాకెఁ దెచ్చి మాటలాడింపుచు నాకు సరిగాఁగఁ జేసితివి సంగతాయఁ బనులు (॥ఆఁట॥) యెంచనైతి నీగుణము ఇటువంటిదయ్యీనని వంచనలేకాడుకొందు వలతువంటా ఇంచుకంత చలివాసి యెదుటికి దీనిఁ దెచ్చి మంచమొక్కించుకొంటివి మంచివాయఁ బనులు (॥ఆఁట॥) మోసపోయి నమ్మితి నీమోహమిది నిజమంటా ఆసపడి నవ్వుదు నీవలమేవంటా వాసికి శ్రీవేంకటేశ వడి నన్నుఁ గూడితివి వేసాలకాకెనంపితి వేడుకాయఁ బనులు English(||pallavi||) ām̐ṭadāni goḍu sūḍarayyo yī magavāri- kem̐ṭibuddi vuṭṭiṁchĕ nī saḍabum̐ garmamu (||ām̐ṭa||) yiravĕram̐gamu mammuniṁta sesevani nīge karam̐gudu nīmomu gannadām̐kānu mariginayāgĕm̐ dĕchchi māḍalāḍiṁpusu nāgu sarigām̐gam̐ jesidivi saṁgadāyam̐ banulu (||ām̐ṭa||) yĕṁchanaidi nīguṇamu iḍuvaṁṭidayyīnani vaṁchanalegāḍugŏṁdu valaduvaṁṭā iṁchugaṁta salivāsi yĕduḍigi dīnim̐ dĕchchi maṁchamŏkkiṁchugŏṁṭivi maṁchivāyam̐ banulu (||ām̐ṭa||) mosaboyi nammidi nīmohamidi nijamaṁṭā āsabaḍi navvudu nīvalamevaṁṭā vāsigi śhrīveṁkaḍeśha vaḍi nannum̐ gūḍidivi vesālagāgĕnaṁpidi veḍugāyam̐ banulu