Title (Indic)ఆఁటదాని బలునిది ఆడుకోనేమున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని బలునిది ఆడుకోనేమున్నది కూటములు గలిగితే కొంగువట్టి తీసును (॥ఆఁట॥) కూరిమిగలుగు సతి కోపగించుకొంటేను పేరడి కన్నీరు నించు ప్రియుని తోను ఆరీతి నాఱడికత్తెయైతే మఱియొకతె నేరుపుతోడ నూరకే నెటికవిరుచు (॥ఆఁట॥) యేఁపిన విభుఁడువచ్చి యెదుట నిలిచితేను దాపుగఁజేయెత్తిమొక్కి తలవంచును రావుతోడ వేరొకతె రాజసమైనది యైతే తీపుల మోవి మీఁద తిట్టులెల్లాఁదిట్టును (॥ఆఁట॥) ఆసపడ్డ మగువను ఆయములంటితేను నేసవెట్టి లోనౌను సిగ్గుతోడను యీసుదీర శ్రీవేంకటేశ ననుఁబోఁటిదైతే వాసికి నిన్నుఁగూడి వలపెల్లా నింతును English(||pallavi||) ām̐ṭadāni balunidi āḍugonemunnadi kūḍamulu galigide kŏṁguvaṭṭi tīsunu (||ām̐ṭa||) kūrimigalugu sadi kobagiṁchugŏṁṭenu peraḍi kannīru niṁchu priyuni tonu ārīdi nāṟaḍigattĕyaide maṟiyŏgadĕ nerubudoḍa nūrage nĕḍigavirusu (||ām̐ṭa||) yem̐pina vibhum̐ḍuvachchi yĕduḍa nilisidenu dābugam̐jeyĕttimŏkki talavaṁchunu rāvudoḍa verŏgadĕ rājasamainadi yaide tībula movi mīm̐da tiṭṭulĕllām̐diṭṭunu (||ām̐ṭa||) āsabaḍḍa maguvanu āyamulaṁṭidenu nesavĕṭṭi lonaunu siggudoḍanu yīsudīra śhrīveṁkaḍeśha nanum̐bom̐ṭidaide vāsigi ninnum̐gūḍi valabĕllā niṁtunu