Title (Indic)ఆఁటదాని బదుకింత ఆరడి గద్దా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁటదాని బదుకింత ఆరడి గద్దా కూటములలో పనులు గుట్టు సేయవలదా (॥ఆఁట॥) దేవునే విన్నవించిన తియ్యముచ్చట లెల్లా ఆవల నానతిత్తురా ఆకెతోడను చేవ మీరి నీకు నేఁజేసినసేవలెల్లా యేవలనైనా రచ్చ కెక్కేటివా (॥ఆఁట॥) చిత్తగించ నవధరించిన నాతో పొందు లెల్లా నిత్తెమును నాటి కవి నేరువుదురా హత్తి నీ కతలకు లోనైన రహస్యము లెల్లా కొత్తగాఁ బరులకు వూఁకొనవచ్చేవా (॥ఆఁట॥) కూడేవేళ నేఁ జేసిన గుఱుతైన వూడిగాలు సూడిదెగా నాపె కవి చూపవచ్చునా యీడనే శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను వేడుకపడేదే కాక వెనకతీ సేవా English(||pallavi||) ām̐ṭadāni badugiṁta āraḍi gaddā kūḍamulalo panulu guṭṭu seyavaladā (||ām̐ṭa||) devune vinnaviṁchina tiyyamuchchaḍa lĕllā āvala nānaditturā āgĕdoḍanu seva mīri nīgu nem̐jesinasevalĕllā yevalanainā rachcha kĕkkeḍivā (||ām̐ṭa||) sittagiṁcha navadhariṁchina nādo pŏṁdu lĕllā nittĕmunu nāḍi kavi neruvudurā hatti nī kadalagu lonaina rahasyamu lĕllā kŏttagām̐ barulagu vūm̐kŏnavachchevā (||ām̐ṭa||) kūḍeveḽa nem̐ jesina guṟudaina vūḍigālu sūḍidĕgā nābĕ kavi sūbavachchunā yīḍane śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu veḍugabaḍede kāga vĕnagadī sevā