Title (Indic)ఆఁగఁ జేసు నా చూపులటు వోవయ్య WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁగఁ జేసు నా చూపులటు వోవయ్య మూఁగిన నా వలపుల మూలకు రానేలా (॥ఆఁగ॥) ఇమ్ముల నొల్లని వారమేల నీకు నామేని- అమ్ముల పులకలొత్తీ నటు వోవయ్య కమ్మవిలుతునిచేతఁ గాఁగెడి నన్నొరసేవు నెమ్మది నుండి యుండి నీకు నొవ్వనేలా (॥ఆంగ॥) ఇతవు గాని వారమేల నీకు నామేని- ఆతితాపమంటుఁ జేసు నటు వోవయ్య రతిరాజుచేత నారడిఁబడ్డ ననుఁ జేరి జతనాన వుండివుండి జాలిఁబొంద నేల (॥ఆఁగ॥) ఇంతటి నీ కౌగిటికి నేల నేము మాకోప- మంతరమెఱఁగనేరదటు వోవయ్య పంతగాఁడ వెంకటపతి నీవు ననుఁ గూడి చింతతోడఁ బొరలుచు సిలుగంద నేలా English(||pallavi||) ām̐gam̐ jesu nā sūbulaḍu vovayya mūm̐gina nā valabula mūlagu rānelā (||ām̐ga||) immula nŏllani vāramela nīgu nāmeni- ammula pulagalŏttī naḍu vovayya kammaviludunisedam̐ gām̐gĕḍi nannŏrasevu nĕmmadi nuṁḍi yuṁḍi nīgu nŏvvanelā (||āṁga||) idavu gāni vāramela nīgu nāmeni- ādidābamaṁṭum̐ jesu naḍu vovayya radirājuseda nāraḍim̐baḍḍa nanum̐ jeri jadanāna vuṁḍivuṁḍi jālim̐bŏṁda nela (||ām̐ga||) iṁtaḍi nī kaugiḍigi nela nemu māgoba- maṁtaramĕṟam̐ganeradaḍu vovayya paṁtagām̐ḍa vĕṁkaḍabadi nīvu nanum̐ gūḍi siṁtadoḍam̐ bŏralusu silugaṁda nelā