Title (Indic)ఆఁడువారు కడుఁ గోపు లవుట నీ వెఱుఁగవా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁడువారు కడుఁ గోపు లవుట నీ వెఱుఁగవా నేఁడు గొత్తలుగా బూమి నేర్చుక వచ్చేరా (॥ఆఁడు॥) వలచినఁడువారు వాదులాటకు వచ్చిన చలము సాదించువాఁడు జాణఁడా వాఁడు కలయ నీరాకతోడ కమ్మటి నీలిగి పోఁగా పిలిచి మాటాడకున్న ప్రియుడా వాఁడు (॥ఆఁడు॥) చనవు గలుగువారు సణఁగులఁ దిట్టఁ గాను కనలి యెగ్గువట్టితే ఘనుఁడా వాఁడు గునిసి సవతులపై కోపాన పతి నంటేను విని నవ్వకుండేవాఁడు విభుఁడా వాఁడు (॥ఆఁడు॥) పాయరానియట్టివారు బలుములు చూసితేను నాయాలఁ బెట్టెడివాఁడు నాథుఁడా వాఁడు యీయెడ శ్రీవేంకటేశ యింతి నిట్టె కూడితివి చాయకు రాకుండువాఁడు సరసుఁడా వాఁడు English(||pallavi||) ām̐ḍuvāru kaḍum̐ gobu lavuḍa nī vĕṟum̐gavā nem̐ḍu gŏttalugā būmi nersuga vachcherā (||ām̐ḍu||) valasinam̐ḍuvāru vādulāḍagu vachchina salamu sādiṁchuvām̐ḍu jāṇam̐ḍā vām̐ḍu kalaya nīrāgadoḍa kammaḍi nīligi pom̐gā pilisi māḍāḍagunna priyuḍā vām̐ḍu (||ām̐ḍu||) sanavu galuguvāru saṇam̐gulam̐ diṭṭam̐ gānu kanali yĕgguvaṭṭide ghanum̐ḍā vām̐ḍu gunisi savadulabai kobāna padi naṁṭenu vini navvaguṁḍevām̐ḍu vibhum̐ḍā vām̐ḍu (||ām̐ḍu||) pāyarāniyaṭṭivāru balumulu sūsidenu nāyālam̐ bĕṭṭĕḍivām̐ḍu nāthum̐ḍā vām̐ḍu yīyĕḍa śhrīveṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi sāyagu rāguṁḍuvām̐ḍu sarasum̐ḍā vām̐ḍu