Title (Indic)ఆఁడువారి గుణ మిది యటువంటిదాన గాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁడువారి గుణ మిది యటువంటిదాన గాను నేఁడు నన్నేలుకో వారు నిన్ను దూరఁజూతురు (॥॥) మట మాయతనమున మగువలు మగవారి సటకారితనమున సాదింతురు తటుకన వలచితేఁ దగిలించుకొని యట్టె యిటునటు భ్రమయించి యెలయించఁ జూతురు (॥॥) వేసదావరినితలు వెంగెము లప్పటిఁ జూపి కాసువీసములకుఁగా గరఁగింతురు ఆసపడి లోనైతే నందవాయకుండాఁ జేసి బాసగొని మోసపుచ్చి పంతమాడఁ జూతురు (॥॥) యేతులాఁడికాంతలు యెందునైనా సందుచూచి వాతరొట్టుమాట లాడి వంచుకొందురు యీతల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి చేతఁ జిక్కుకున్న వారు సిగ్గువడఁ జూతురు English(||pallavi||) ām̐ḍuvāri guṇa midi yaḍuvaṁṭidāna gānu nem̐ḍu nannelugo vāru ninnu dūram̐jūduru (||||) maḍa māyadanamuna maguvalu magavāri saḍagāridanamuna sādiṁturu taḍugana valasidem̐ dagiliṁchugŏni yaṭṭĕ yiḍunaḍu bhramayiṁchi yĕlayiṁcham̐ jūduru (||||) vesadāvarinidalu vĕṁgĕmu lappaḍim̐ jūbi kāsuvīsamulagum̐gā garam̐giṁturu āsabaḍi lonaide naṁdavāyaguṁḍām̐ jesi bāsagŏni mosabuchchi paṁtamāḍam̐ jūduru (||||) yedulām̐ḍigāṁtalu yĕṁdunainā saṁdusūsi vādarŏṭṭumāḍa lāḍi vaṁchugŏṁduru yīdala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi sedam̐ jikkugunna vāru sigguvaḍam̐ jūduru