Title (Indic)ఆఁడుఁగొల వచ్చుఁ జుమ్మీ ఆచారా లింతైతే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆఁడుఁగొల వచ్చుఁ జుమ్మీ ఆచారా లింతైతే నేఁడు గామించితిఁ జుమ్మీ నిన్ను రఘునాథ (॥ఆఁడు॥) తొంగిచూచి నంతలోనే దోసము వచ్చీనా అంగవించి వలచిన ఆఁడుదానను ముంగిట మాటాడితేనే మోనము దప్పౌనా యెంగిలౌనా మోవిపండు ఇంతలోనే నీకును (॥ఆఁడు॥) పాదము సోఁకించితేనే పంతములు దప్పీనా వీదిఁబోతాఁ జెనకినవెలఁది నేను పాదై సంగడినుంటే బతిమి వొయ్యీనా సోదించి కళలు నీకు జొబ్బిలీని ఇపుడే (॥ఆఁడు॥) తొడమీఁద నిడుకొంటే దొరతనము వొయ్యీనా బడిబడిఁ దిరిగాడే పడఁతి నేను కడఁగి శ్రీ వేంకటాద్రిఘనుఁడ వావిలిపాటి - వొడయ రాఘవ కూడి వొద్దికఁ బాయకుమీ English(||pallavi||) ām̐ḍum̐gŏla vachchum̐ jummī āsārā liṁtaide nem̐ḍu gāmiṁchidim̐ jummī ninnu raghunātha (||ām̐ḍu||) tŏṁgisūsi naṁtalone dosamu vachchīnā aṁgaviṁchi valasina ām̐ḍudānanu muṁgiḍa māḍāḍidene monamu dappaunā yĕṁgilaunā movibaṁḍu iṁtalone nīgunu (||ām̐ḍu||) pādamu som̐kiṁchidene paṁtamulu dappīnā vīdim̐bodām̐ jĕnaginavĕlam̐di nenu pādai saṁgaḍinuṁṭe badimi vŏyyīnā sodiṁchi kaḽalu nīgu jŏbbilīni ibuḍe (||ām̐ḍu||) tŏḍamīm̐da niḍugŏṁṭe dŏradanamu vŏyyīnā baḍibaḍim̐ dirigāḍe paḍam̐ti nenu kaḍam̐gi śhrī veṁkaḍādrighanum̐ḍa vāvilibāḍi - vŏḍaya rāghava kūḍi vŏddigam̐ bāyagumī