Title (Indic)ఆమనిపువ్వువంటిది ఆయమైన వయసు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆమనిపువ్వువంటిది ఆయమైన వయసు కామించి భోగించక యా(యే?)మరఁదగునా (॥ఆమ॥) చలపాదితనమేల సణఁగులాడఁగనేల బలిమిఁ బెనఁగేయట్టి పతితోను పలుకరాదా కప్రపుబాగా లియ్యఁగరాదా చెలులకు నింతేసి సిగ్గువడఁదగునా (॥ఆమ॥) బిగియఁగ నింతయేల పెచ్చువెరుగఁగనేల పగటునఁ దమకించే పతితోను నగవులు నగరాదా నయములు చూపరాదా చిగురుమోవితోడ సిగ్గువడఁదగునా (॥ఆమ॥) మరిగించ నింతయేల మనసులు చూడనేల పరగ శ్రీ వేంకటపతితోను గరిమెల మెచ్చరాదా కాఁగిటఁగూడె నతఁడు శిరసువంచుక యట్టె సిగ్గువడఁదగునా English(||pallavi||) āmanibuvvuvaṁṭidi āyamaina vayasu kāmiṁchi bhogiṁchaga yā(ye?)maram̐dagunā (||āma||) salabādidanamela saṇam̐gulāḍam̐ganela balimim̐ bĕnam̐geyaṭṭi padidonu palugarādā kaprabubāgā liyyam̐garādā sĕlulagu niṁtesi sigguvaḍam̐dagunā (||āma||) bigiyam̐ga niṁtayela pĕchchuvĕrugam̐ganela pagaḍunam̐ damagiṁche padidonu nagavulu nagarādā nayamulu sūbarādā sigurumovidoḍa sigguvaḍam̐dagunā (||āma||) marigiṁcha niṁtayela manasulu sūḍanela paraga śhrī veṁkaḍabadidonu garimĕla mĕchcharādā kām̐giḍam̐gūḍĕ nadam̐ḍu śhirasuvaṁchuga yaṭṭĕ sigguvaḍam̐dagunā