Title (Indic)ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ జాలిదీర నీకే శరణుచొచ్చితిమి (॥ఆలించు॥) గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే పతియు నీవే యేపట్టునా మాకు యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్నుఁబోల చతురుఁడ నిన్నునే శరణుచొచ్చితిమి (॥ఆలించు॥) జననీజనకులు శరణము నీవే వునికి మనికి నీవే వుపము నీవే మనసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి (॥ఆలించు॥) లోకసాక్షివి నీవే లోకబంధుఁడవు నీవే యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె నీకంటె మరిలేరు నిఖిలమింతయుఁ గావ సాకారరూప నీకే శరణుచొచ్చితిమి English(||pallavi||) āliṁchu pāliṁchu ādimaburuṣha kṣhama jālidīra nīge śharaṇusŏchchidimi (||āliṁchu||) gadi nīve madi nīve kardavu bhardavu nīve padiyu nīve yebaṭṭunā māgu yidaramu lĕvvarunnā rĕṁchisūḍa ninnum̐bola sadurum̐ḍa ninnune śharaṇusŏchchidimi (||āliṁchu||) jananījanagulu śharaṇamu nīve vunigi manigi nīve vubamu nīve manasichchi nīve nannu manniṁchugŏṁṭene sanavi manavi nīge śharaṇusŏchchidimi (||āliṁchu||) logasākṣhivi nīve logabaṁdhum̐ḍavu nīve yīgaḍa śhrīveṁkaḍeśha yidivo nīvĕ nīgaṁṭĕ marileru nikhilamiṁtayum̐ gāva sāgārarūba nīge śharaṇusŏchchidimi