Title (Indic)ఆలిమగని జాడలు అందరికి నివియే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆలిమగని జాడలు అందరికి నివియే మేలుమీఁదుగా విభుని మెప్పించవే నీవు (॥ఆలి॥) వింత లేక మెలఁగితే వేడుక నెరపవలె సంతోసించితేను మెచ్చఁగవలెను మంతనానకు లోనైతే మరిగియుండఁగవలె పంతము లాడఁగరాదు పతితోడఁ జెలికి (॥ఆలి॥) ననుపు గలిగితేను నవ్వులు నవ్వఁగవలె మనసు లెనసితే సమ్మతించవలె వినయాలు నేరిచితే వేమారు వేఁడుకోవలె పెనఁగులాడఁగరాదు ప్రియునితో సతికి (॥ఆలి॥) వావు లేకములైతే వడిఁ బొందుసేయవలె దేవులైతేఁ దనబత్తి దెలుపవలె శ్రీవేంకటేశుఁ డేలితే సిగ్గులు మానఁగవలె కావరించి మీరరాదు కాంతునితో నింతికి English(||pallavi||) ālimagani jāḍalu aṁdarigi niviye melumīm̐dugā vibhuni mĕppiṁchave nīvu (||āli||) viṁta lega mĕlam̐gide veḍuga nĕrabavalĕ saṁtosiṁchidenu mĕchcham̐gavalĕnu maṁtanānagu lonaide marigiyuṁḍam̐gavalĕ paṁtamu lāḍam̐garādu padidoḍam̐ jĕligi (||āli||) nanubu galigidenu navvulu navvam̐gavalĕ manasu lĕnaside sammadiṁchavalĕ vinayālu neriside vemāru vem̐ḍugovalĕ pĕnam̐gulāḍam̐garādu priyunido sadigi (||āli||) vāvu legamulaide vaḍim̐ bŏṁduseyavalĕ devulaidem̐ danabatti dĕlubavalĕ śhrīveṁkaḍeśhum̐ ḍelide siggulu mānam̐gavalĕ kāvariṁchi mīrarādu kāṁtunido niṁtigi