Title (Indic)ఆలవట్టములు వట్టే రవధరించఁగదో పెద్ద WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆలవట్టములు వట్టే రవధరించఁగదో పెద్ద- పాలిండ్ల బరవున భామ బడలితివి (॥ఆల॥) మజ్జనమవధరింతు మగువ విచ్చేయవో గొజ్జంగ కస్తూరినీటఁ గుంకుమనీట గజ్జల గరుడునిపై కలికి విభునిఁ గూడి ముజ్జగములఁ దిరిగి మొగినలసితివి (॥ఆల॥) బోనము వెట్టినారిదె పొలఁతి విచ్చేయవో ఐనకూరలెల్లఁ జల్లనారీనిదే తేనెలూరెడి కెమ్మోవితీపులు నీ విభునకుఁ గానుకగా నిచ్చియిచ్చి కడునలసితివి (॥ఆల॥) చప్పరమంచముపైకి సరుగ విచ్చేయవో అప్పఁడు వేంకటరాయఁడలరీ వాఁడే కొప్పెరగుబ్బలమీఁది కొనగోరిరచనల కప్పురము మెత్తిమెత్తి కడునలసితివి English(||pallavi||) ālavaṭṭamulu vaṭṭe ravadhariṁcham̐gado pĕdda- pāliṁḍla baravuna bhāma baḍalidivi (||āla||) majjanamavadhariṁtu maguva vichcheyavo gŏjjaṁga kastūrinīḍam̐ guṁkumanīḍa gajjala garuḍunibai kaligi vibhunim̐ gūḍi mujjagamulam̐ dirigi mŏginalasidivi (||āla||) bonamu vĕṭṭināridĕ pŏlam̐ti vichcheyavo ainagūralĕllam̐ jallanārīnide tenĕlūrĕḍi kĕmmovidībulu nī vibhunagum̐ gānugagā nichchiyichchi kaḍunalasidivi (||āla||) sapparamaṁchamubaigi saruga vichcheyavo appam̐ḍu veṁkaḍarāyam̐ḍalarī vām̐ḍe kŏppĕragubbalamīm̐di kŏnagorirasanala kappuramu mĕttimĕtti kaḍunalasidivi