Title (Indic)ఆలాగుపొందులును నటువంటి కూటములు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆలాగుపొందులును నటువంటి కూటములు యీలాగులౌట నే డిదె చూడనయితి (॥ఆలా॥) అడియాసచూపులకు నాసగించితిఁగాని వెడమాయలని లోను వెదకలేనైతి కడువేడుకలఁ దగిలి గాసిఁ బొందితిఁగాని యెడలేనిపరితాప మెఱఁగలేనైతి (॥ఆలా॥) చిరునగవుమాటలకుఁ జిత్తగించితిఁగాని తరితీపులని లోనుఁ దలఁపలేనైతి వరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగాని గరువంపుఁ బొలయలుక గానలేనైతి (॥ఆలా॥) శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగాని దేవోత్తమునిలాగుఁ దెలియలేనైతి యీవైభవముపై నిచ్చగించితిఁగాని యీవైభవానంద మిది పొందనైతి English(||pallavi||) ālāgubŏṁdulunu naḍuvaṁṭi kūḍamulu yīlāgulauḍa ne ḍidĕ sūḍanayidi (||ālā||) aḍiyāsasūbulagu nāsagiṁchidim̐gāni vĕḍamāyalani lonu vĕdagalenaidi kaḍuveḍugalam̐ dagili gāsim̐ bŏṁdidim̐gāni yĕḍalenibaridāba mĕṟam̐galenaidi (||ālā||) sirunagavumāḍalagum̐ jittagiṁchidim̐gāni taridībulani lonum̐ dalam̐palenaidi varusa mohabum̐ basalavalalam̐ jikkidim̐gāni garuvaṁpum̐ bŏlayaluga gānalenaidi (||ālā||) śhrīveṁkaḍeśhvarunim̐ jiṁta sesidim̐gāni devottamunilāgum̐ dĕliyalenaidi yīvaibhavamubai nichchagiṁchidim̐gāni yīvaibhavānaṁda midi pŏṁdanaidi