Title (Indic)ఆకెఁ బిలువవయ్యా యిచ్చటికిని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెఁ బిలువవయ్యా యిచ్చటికిని కాకరిపను లడుగఁగవలె నిఁకను (॥॥) నునుపులమాఁటలు నాతోనాడఁగ కనుగొని నవ్వీఁగడ నొకతె యెనయఁగ నీగుణ మేమిదెలిసెనో వెనకటిపను లవి వినవలె నిఁకను (॥॥) సరసముతో నాసరులు దిద్దఁగా కెరలుచు నటు గొణఁగీ నొకతె ధర నీ సేఁతలు తానేమెఱుఁగునో గరిమ లన్నియునుఁ గనవలె నిఁకను (॥॥) కందువతో ననుఁ గాఁగిలించగా చెంది సన్న సేసీ నొకతె యిందునె శ్రీవేంకటేశ కూడితివి చందము లిటు మెచ్చఁగవలె నిఁకను English(||pallavi||) āgĕm̐ biluvavayyā yichchaḍigini kāgaribanu laḍugam̐gavalĕ nim̐kanu (||||) nunubulamām̐ṭalu nādonāḍam̐ga kanugŏni navvīm̐gaḍa nŏgadĕ yĕnayam̐ga nīguṇa memidĕlisĕno vĕnagaḍibanu lavi vinavalĕ nim̐kanu (||||) sarasamudo nāsarulu diddam̐gā kĕralusu naḍu gŏṇam̐gī nŏgadĕ dhara nī sem̐talu tānemĕṟum̐guno garima lanniyunum̐ ganavalĕ nim̐kanu (||||) kaṁduvado nanum̐ gām̐giliṁchagā sĕṁdi sanna sesī nŏgadĕ yiṁdunĕ śhrīveṁkaḍeśha kūḍidivi saṁdamu liḍu mĕchcham̐gavalĕ nim̐kanu