Title (Indic)ఆకెకు నీకుఁ దెలుసు నౌభళేశా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెకు నీకుఁ దెలుసు నౌభళేశా యేకతాననే యరసి యెఱుఁగుకో రాదా (॥॥) యెదురుఁ గొండలెక్కి యేటి కొల కే మమ్మ అదిగో సొలసి మాటలాడీ నిన్ను పొదిగి పొదిగి యట్టే బొమ్మల జంకించు కొంటా తుదలేని వేడుకలఁ దొంగి చూచీని (॥॥) చల్లని మాకులనీడ సమదిష్టితో నీకు వొల్లని ప్రియాలు చెప్పి వొరసీ నిన్ను తెల్లమిగా సెలవులఁ దెగ నవ్వు నవ్వుకొంటా పల్లదాన నీపైఁ బూబంతి వేసీని (॥॥) మిక్కుటపుఁ దమకము మించఁగా నీ తొడ యెక్కి గక్కునఁ జన్నుల నొత్తి కలసీ నీతో తక్కక యహోబలానఁ దగ శ్రీ వేంకటాద్రిని వొక్కటై నిన్నుఁ బెండ్లాడి వొద్దికె చూపీని English(||pallavi||) āgĕgu nīgum̐ dĕlusu naubhaḽeśhā yegadānane yarasi yĕṟum̐gugo rādā (||||) yĕdurum̐ gŏṁḍalĕkki yeḍi kŏla ke mamma adigo sŏlasi māḍalāḍī ninnu pŏdigi pŏdigi yaṭṭe bŏmmala jaṁkiṁchu kŏṁṭā tudaleni veḍugalam̐ dŏṁgi sūsīni (||||) sallani māgulanīḍa samadiṣhṭido nīgu vŏllani priyālu sĕppi vŏrasī ninnu tĕllamigā sĕlavulam̐ dĕga navvu navvugŏṁṭā palladāna nībaim̐ būbaṁti vesīni (||||) mikkuḍabum̐ damagamu miṁcham̐gā nī tŏḍa yĕkki gakkunam̐ jannula nŏtti kalasī nīdo takkaga yahobalānam̐ daga śhrī veṁkaḍādrini vŏkkaḍai ninnum̐ bĕṁḍlāḍi vŏddigĕ sūbīni