Title (Indic)ఆకెకు నీకుఁ దెలుసు నన్నిపనులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెకు నీకుఁ దెలుసు నన్నిపనులు యీ కడ మమ్ము నట్టె యేమి చూచేవయ్యా (॥ఆకె॥) కతకఱచిన మాట కలికి నీతో నాడె యితవుగా నవ్వితిని ఇందుకు నీవు రతికెక్కితిరి మీరు రచ్చల నిన్నిటా నేఁడు చతురత మమ్ము నేమి సారెఁ జూచేవయ్యా (॥ఆకె॥) సేయరాని చేఁత నీ చెక్కుల నట్టె సేసె చాయలకు నీవవి సమ్మతించితి బాయిటఁ బడెను మీ పై పై వలపులెల్లా మీయెడ నీవు మమ్ము నేమి చూచేవయ్యా (॥ఆకె॥) కనురెప్ప మఱఁగైతే కాఁగిలించుకొనె నాపె మనసిచ్చి, కరఁగె నీ మర్మములు ననిచి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి యిట్టె యినుమడించెను మోహ మేమి చూచేవయ్యా English(||pallavi||) āgĕgu nīgum̐ dĕlusu nannibanulu yī kaḍa mammu naṭṭĕ yemi sūsevayyā (||āgĕ||) kadagaṟasina māḍa kaligi nīdo nāḍĕ yidavugā navvidini iṁdugu nīvu radigĕkkidiri mīru rachchala ninniḍā nem̐ḍu sadurada mammu nemi sārĕm̐ jūsevayyā (||āgĕ||) seyarāni sem̐ta nī sĕkkula naṭṭĕ sesĕ sāyalagu nīvavi sammadiṁchidi bāyiḍam̐ baḍĕnu mī pai pai valabulĕllā mīyĕḍa nīvu mammu nemi sūsevayyā (||āgĕ||) kanurĕppa maṟam̐gaide kām̐giliṁchugŏnĕ nābĕ manasichchi, karam̐gĕ nī marmamulu nanisi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi yiṭṭĕ yinumaḍiṁchĕnu moha memi sūsevayyā