Title (Indic)ఆకెకు నీకుఁ దెలుసు నాముకొన్న తగవుల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెకు నీకుఁ దెలుసు నాముకొన్న తగవుల దాకొన్న సిగ్గును మతి దలఁచ దేమియును (॥ఆకె॥) ఇంతి కెంతచనవు నీ విచ్చితివో కాని నీతో మంతనానఁ దానొక్కతే మాటలాడీని వంతుల సవతులెల్లా వాకిటనే వుండఁగాను వింతలుగాఁ దమిరేఁచి వీడె మిచ్చీని (॥ఆకె॥) మగువ నెట్ల నీవు మరిగించుకొంటివో బగి వాయ దెపుడు నీపానుపుమీఁద నగుతా నూడిగానకు నాతులు గాచుకుండఁగా పగటుఁ జప్పుడుతోడ పాదము లొత్తీని (॥ఆకె॥) మానినికి నెటువంటి మాట పట్టు సేసితివో తానకమై నిన్ను లోన దాఁచుకున్నది వూని దయతోడ నిన్ను నొనఁగూర్చె నందరిని ఆనుక శ్రీవేంకటేశ అట్టె తానూఁ గూడీని English(||pallavi||) āgĕgu nīgum̐ dĕlusu nāmugŏnna tagavula dāgŏnna siggunu madi dalam̐sa demiyunu (||āgĕ||) iṁti kĕṁtasanavu nī vichchidivo kāni nīdo maṁtanānam̐ dānŏkkade māḍalāḍīni vaṁtula savadulĕllā vāgiḍane vuṁḍam̐gānu viṁtalugām̐ damirem̐si vīḍĕ michchīni (||āgĕ||) maguva nĕṭla nīvu marigiṁchugŏṁṭivo bagi vāya dĕbuḍu nībānubumīm̐da nagudā nūḍigānagu nādulu gāsuguṁḍam̐gā pagaḍum̐ jappuḍudoḍa pādamu lŏttīni (||āgĕ||) māninigi nĕḍuvaṁṭi māḍa paṭṭu sesidivo tānagamai ninnu lona dām̐sugunnadi vūni dayadoḍa ninnu nŏnam̐gūrsĕ naṁdarini ānuga śhrīveṁkaḍeśha aṭṭĕ tānūm̐ gūḍīni