Title (Indic)ఆకెకు నీకుఁ దెలుసు నామీఁది సుద్దులెల్లా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెకు నీకుఁ దెలుసు నామీఁది సుద్దులెల్లా చేకొని వాకుచ్చి నీతో చెప్పనేమున్నదిరా (॥ఆకె॥) ఆయముసోఁకినమాఁట లప్పుడు నీవాడఁగాను కాయమెల్లఁ బులకించెఁ గరఁగీ చెలి చాయ సేసుకొని నీవు సంగడివారి మొరఁగి మాయలనవ్వు నవ్వేవు మరి నేనేమందురా (॥ఆకె॥) కమ్మటి నీవు కడగండ్లనే చూడఁగాను యెమ్మెలెల్లా నాడదా నీయింతి ఆవేళ దిమ్మురేఁగి చెలులకుఁ దెలియకుండా నీవు చిమ్మి పెదవిసన్నలు సేసేవు యేమందురా (॥ఆకె॥) అంటిముట్టి యాపెను నీ వరమఱపించఁగాను నంటులెల్ల నడపదా నమ్మి యీడను గొంటవై శ్రీవేంకటేశ కూడితి విందుకు నన్నుఁ జంటలఁ గొసరితేను సాదించే వేమందురా English(||pallavi||) āgĕgu nīgum̐ dĕlusu nāmīm̐di suddulĕllā segŏni vāguchchi nīdo sĕppanemunnadirā (||āgĕ||) āyamusom̐kinamām̐ṭa lappuḍu nīvāḍam̐gānu kāyamĕllam̐ bulagiṁchĕm̐ garam̐gī sĕli sāya sesugŏni nīvu saṁgaḍivāri mŏram̐gi māyalanavvu navvevu mari nenemaṁdurā (||āgĕ||) kammaḍi nīvu kaḍagaṁḍlane sūḍam̐gānu yĕmmĕlĕllā nāḍadā nīyiṁti āveḽa dimmurem̐gi sĕlulagum̐ dĕliyaguṁḍā nīvu simmi pĕdavisannalu sesevu yemaṁdurā (||āgĕ||) aṁṭimuṭṭi yābĕnu nī varamaṟabiṁcham̐gānu naṁṭulĕlla naḍabadā nammi yīḍanu gŏṁṭavai śhrīveṁkaḍeśha kūḍidi viṁdugu nannum̐ jaṁṭalam̐ gŏsaridenu sādiṁche vemaṁdurā