Title (Indic)ఆకె యదె పిలువరే అందరు నో చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె యదె పిలువరే అందరు నో చెలులాల చేకొని పతి వేడుక చెల్లించవలెను (॥ఆకె॥) మగువ దనునాడినమాటలు దలఁచుకొంటా తగినచక్కఁదనాలు తలఁచుకొంటా నగుతాఁ బొందుసేసినననుపుఁ దలచుకొంటా వొగి లోనఁ బవళించి వున్నాఁడు రమణుఁడు (॥ఆకె॥) పడఁతిపక్కననుండినభావము దలఁచుకొంటా తడఁబాటురతులెల్లాఁ దలఁచుకొంటా కడుమనోరథములు కల్పించి తలఁచుకొంటా వుడివోనివేడుకతో నున్నాఁడు రమణుఁడు (॥ఆకె॥) అలమేలుమంగచేఁత లన్నియు దలఁచుకొంటా తలకొన్ననేరుపులు దలచుకొంటా కలసి ఇప్పుడు తొంటికతలు దలఁచుకొంటా వెలయుచున్నాఁడు శ్రీవేంకరమణుఁడు English(||pallavi||) āgĕ yadĕ piluvare aṁdaru no sĕlulāla segŏni padi veḍuga sĕlliṁchavalĕnu (||āgĕ||) maguva danunāḍinamāḍalu dalam̐sugŏṁṭā taginasakkam̐danālu talam̐sugŏṁṭā nagudām̐ bŏṁdusesinananubum̐ dalasugŏṁṭā vŏgi lonam̐ bavaḽiṁchi vunnām̐ḍu ramaṇum̐ḍu (||āgĕ||) paḍam̐tibakkananuṁḍinabhāvamu dalam̐sugŏṁṭā taḍam̐bāḍuradulĕllām̐ dalam̐sugŏṁṭā kaḍumanorathamulu kalbiṁchi talam̐sugŏṁṭā vuḍivoniveḍugado nunnām̐ḍu ramaṇum̐ḍu (||āgĕ||) alamelumaṁgasem̐ta lanniyu dalam̐sugŏṁṭā talagŏnnanerubulu dalasugŏṁṭā kalasi ippuḍu tŏṁṭigadalu dalam̐sugŏṁṭā vĕlayusunnām̐ḍu śhrīveṁkaramaṇum̐ḍu