Title (Indic)ఆకె వో నా ప్రాణమోహనపు రాణి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె వో నా ప్రాణమోహనపు రాణి దాకొని వేవేలు కాంతలలోన నున్నది (॥ఆకె॥) ముదితకురుల నెల్లా ముత్యములు మాణికాలు గుదిగుచ్చి కీలుగంటు గొన్నది సదరపు పసిఁడివజ్రాల చనుకట్టుది అదె పైడిపూవులపయ్యెద వల్లెవాటుది (॥ఆకె॥) పచ్చలు దాచినయట్టి పాదుకలు మెట్టినది లచ్చన మొగవుల మొలనూళ్లది అచ్చపుటుంగరముల అందెలుఁ బాయవట్టాలు గచ్చుల ముంజేతుల కంకణసూడిగేలది (॥ఆకె॥) నానాభూషణముల నానాసింగారాల పానిపట్టి నా దిక్కె తప్పక చూచేది ఆనకపు శ్రీ వెంకటాద్రిపతినైన నన్ను తానె వచ్చి కూడి నాదగ్గరనె వున్నది English(||pallavi||) āgĕ vo nā prāṇamohanabu rāṇi dāgŏni vevelu kāṁtalalona nunnadi (||āgĕ||) mudidagurula nĕllā mutyamulu māṇigālu gudiguchchi kīlugaṁṭu gŏnnadi sadarabu pasim̐ḍivajrāla sanugaṭṭudi adĕ paiḍibūvulabayyĕda vallĕvāḍudi (||āgĕ||) pachchalu dāsinayaṭṭi pādugalu mĕṭṭinadi lachchana mŏgavula mŏlanūḽladi achchabuḍuṁgaramula aṁdĕlum̐ bāyavaṭṭālu gachchula muṁjedula kaṁkaṇasūḍigeladi (||āgĕ||) nānābhūṣhaṇamula nānāsiṁgārāla pānibaṭṭi nā dikkĕ tappaga sūsedi ānagabu śhrī vĕṁkaḍādribadinaina nannu tānĕ vachchi kūḍi nādaggaranĕ vunnadi