Title (Indic)ఆకె వింటే నేమైనా ననదా నిన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె వింటే నేమైనా ననదా నిన్ను మేకొని యింతేసి యాల మేర మీరేవు (॥ఆకె॥) నవ్వుతాఁ జెలియాడిన ననుపులమాటలెల్లా యివ్వల నీవీపెకుఁ జెప్పీ(ప్పే) విచ్చకాలకు నివ్వటిల్లఁ గానుకగా నీ కిచ్చిన కప్పురము జవ్వనులకెల్లా నేల సారెకుఁ బెట్టేవు (॥ఆకె॥) పొంచి యాపె నీమైనిండాఁ బూసినతట్టు పుణుఁగు యించుకించుకే చెలుల కేల పూసేవు అంచెల నీమీఁది బత్తినంపిన జాజివిరులు మించి కొలువుసతులమీఁద నేల చల్లేవు (॥ఆకె॥) వింతలుగా నాపె నీకు వేలఁబెట్టిన వుంగర మింతలోఁ బొరుగువారికేల చూపేవు కాంత నిన్నుఁ గూడిన యేకాంతము శ్రీ వేంకటేశ రంతుల నిందరితోడ రవ్వలేల సే సేవు English(||pallavi||) āgĕ viṁṭe nemainā nanadā ninnu megŏni yiṁtesi yāla mera mīrevu (||āgĕ||) navvudām̐ jĕliyāḍina nanubulamāḍalĕllā yivvala nīvībĕgum̐ jĕppī(ppe) vichchagālagu nivvaḍillam̐ gānugagā nī kichchina kappuramu javvanulagĕllā nela sārĕgum̐ bĕṭṭevu (||āgĕ||) pŏṁchi yābĕ nīmainiṁḍām̐ būsinadaṭṭu puṇum̐gu yiṁchugiṁchuge sĕlula kela pūsevu aṁchĕla nīmīm̐di battinaṁpina jājivirulu miṁchi kŏluvusadulamīm̐da nela sallevu (||āgĕ||) viṁtalugā nābĕ nīgu velam̐bĕṭṭina vuṁgara miṁtalom̐ bŏruguvārigela sūbevu kāṁta ninnum̐ gūḍina yegāṁtamu śhrī veṁkaḍeśha raṁtula niṁdaridoḍa ravvalela se sevu