Title (Indic)ఆకె వద్దనుండగానే అండఁ గూచుండుమనేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె వద్దనుండగానే అండఁ గూచుండుమనేవు నీకు వలసితే మరి నెలఁతలు బాఁతే (॥ఆకె॥) వూరకుండేవారినేల వొడివట్టవచ్చేవు చెరి నీతో నవ్వేవారిఁ జెనకరాదా మేరతోడివూడిగపు మెలుఁతను నన్నంటేవు బీరపు నీదేవులతోఁ బెనఁగరాదా (॥ఆకె॥) తెరలోనివారినేల దిష్టించి చూచేవు సరసమాడేవారినే సాదించరాదా పోరుగుననున్ననన్నుఁ బోరచి వెట్టుమనేవు సరినున్నకాంతమోవి చవిగొనరాదా (॥ఆకె॥) కొలువులొనున్నవారికొప్పేల దువ్వేవు లలి నమేల్మంగనే లాలించరాదా చెలికత్తెనైననన్ను శ్రీవేంకటేశ కూడేవు అలమి వురమాపెనే యాదరించరాదా English(||pallavi||) āgĕ vaddanuṁḍagāne aṁḍam̐ gūsuṁḍumanevu nīgu valaside mari nĕlam̐talu bām̐te (||āgĕ||) vūraguṁḍevārinela vŏḍivaṭṭavachchevu sĕri nīdo navvevārim̐ jĕnagarādā meradoḍivūḍigabu mĕlum̐tanu nannaṁṭevu bīrabu nīdevuladom̐ bĕnam̐garādā (||āgĕ||) tĕralonivārinela diṣhṭiṁchi sūsevu sarasamāḍevārine sādiṁcharādā porugunanunnanannum̐ borasi vĕṭṭumanevu sarinunnagāṁtamovi savigŏnarādā (||āgĕ||) kŏluvulŏnunnavārigŏppela duvvevu lali namelmaṁgane lāliṁcharādā sĕligattĕnainanannu śhrīveṁkaḍeśha kūḍevu alami vuramābĕne yādariṁcharādā