Title (Indic)ఆకె నీకే తగు నమరుఁ బెండ్లికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకె నీకే తగు నమరుఁ బెండ్లికి పోఁక ముడిచితిమి పొలఁతికి నేము (॥ఆకె॥) కొండల వంటివి కోమలి కుచములు బండగు రాలురప్పలుఁ గావు దండనే నెమ్మోవు తామెరవంటిది గుండుమూఁకరేకులవలెఁ గాదు (॥ఆకె॥) మెలుఁతనెరిఁదురుము మేఘము వంటిది అలరు గాలిగొట్టది గాదు చెలవపు నడుమిది సింహమువంటిది పొలసి అడవిఁగాఁపురమటు గాదు (॥ఆకె॥) సతిమేను మెఱుఁగు చాయ వంటిది తతితో మెరిచటు దాఁగదు యితవగు శ్రీవేంకటేశ యీ చెలికిఁ బతివై కూడితివి పలుకెడగాదు English(||pallavi||) āgĕ nīge tagu namarum̐ bĕṁḍligi pom̐ka muḍisidimi pŏlam̐tigi nemu (||āgĕ||) kŏṁḍala vaṁṭivi komali kusamulu baṁḍagu rālurappalum̐ gāvu daṁḍane nĕmmovu tāmĕravaṁṭidi guṁḍumūm̐karegulavalĕm̐ gādu (||āgĕ||) mĕlum̐tanĕrim̐durumu meghamu vaṁṭidi alaru gāligŏṭṭadi gādu sĕlavabu naḍumidi siṁhamuvaṁṭidi pŏlasi aḍavim̐gām̐puramaḍu gādu (||āgĕ||) sadimenu mĕṟum̐gu sāya vaṁṭidi tadido mĕrisaḍu dām̐gadu yidavagu śhrīveṁkaḍeśha yī sĕligim̐ badivai kūḍidivi palugĕḍagādu