Title (Indic)ఆకెఱుఁగు నీవూ నెఱుఁగుదదియె మాట WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆకెఱుఁగు నీవూ నెఱుఁగుదదియె మాట చేకానిక నీకిమ్మనె చెలియ నన్నిపుడు (॥ఆకె॥) వెన్నెల బాయిటనుండి వెలఁదిపాట వింటాను చన్నులపైనొత్తితివి చంద్రవంకలు అన్నిటా నీపై వలపులవె తలఁపించునని విన్నపము సేయుమనె వింతగా నన్నిపుడు (॥ఆకె॥) చవికెలోపలనుండి చదురంగమాడుతాను వువిదకిచ్చితివి నీవుంగరము జవళినదే నిన్ను సారెఁ దలఁపించునని తవిలి నీకెచ్చరించఁ దరవిచ్చెనిపుడు (॥ఆకె॥) పానుపు మీఁదట నుండి పడఁతికౌఁగిటఁ గూడి పూని మోవిమీఁదఁ గెంపులు నించితి నాని శ్రీ వేంకటేశుఁడ ననుపవే రేఁచునని మోనాన మఱవకుండా మొక్కుమనెనిపుడు English(||pallavi||) āgĕṟum̐gu nīvū nĕṟum̐gudadiyĕ māḍa segāniga nīgimmanĕ sĕliya nannibuḍu (||āgĕ||) vĕnnĕla bāyiḍanuṁḍi vĕlam̐dibāḍa viṁṭānu sannulabainŏttidivi saṁdravaṁkalu anniḍā nībai valabulavĕ talam̐piṁchunani vinnabamu seyumanĕ viṁtagā nannibuḍu (||āgĕ||) savigĕlobalanuṁḍi saduraṁgamāḍudānu vuvidagichchidivi nīvuṁgaramu javaḽinade ninnu sārĕm̐ dalam̐piṁchunani tavili nīgĕchchariṁcham̐ daravichchĕnibuḍu (||āgĕ||) pānubu mīm̐daḍa nuṁḍi paḍam̐tigaum̐giḍam̐ gūḍi pūni movimīm̐dam̐ gĕṁpulu niṁchidi nāni śhrī veṁkaḍeśhum̐ḍa nanubave rem̐sunani monāna maṟavaguṁḍā mŏkkumanĕnibuḍu