Title (Indic)ఆతుర(మ?)బందుగుఁడవు అన్నిటా నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతుర(మ?)బందుగుఁడవు అన్నిటా నాకు యీతల నున్నాఁడవుగా యెప్పుడైనాను (॥ఆతు॥) తలఁగి నీరాక గోరి దప్పిఁ బొరలేటివేళఁ గలవుగా యిప్పుడైనాఁ గప్పురమీయ్య జలజలఁ జెమరించి సదమదమై యుండగా వెలినుండి వచ్చితిగా విసరనైనా (॥ఆతు॥) చేరి నిన్నుఁ దలఁచుక చింతతోడ నుండఁగాను నీరూపు చూపితివిగా నేఁడైనాను ఆరీతి నిట్టూరుపుల నసురుసురై వుండఁగా గారవించి స్వస్తపెట్టి కందువ నిల్తువుగా (॥ఆతు॥) నీకుఁగా నెదురుచూచి నవ్వెరగై వుండఁగాను కైకొని శ్రీవేంకటేశ కలసితివి యీకడ నలమేల్మంగ నిటు సేవసేయఁగా మేకొని యిప్పుడు నన్ను మెత్తువుగా నీవు English(||pallavi||) ādura(ma?)baṁdugum̐ḍavu anniḍā nāgu yīdala nunnām̐ḍavugā yĕppuḍainānu (||ādu||) talam̐gi nīrāga gori dappim̐ bŏraleḍiveḽam̐ galavugā yippuḍainām̐ gappuramīyya jalajalam̐ jĕmariṁchi sadamadamai yuṁḍagā vĕlinuṁḍi vachchidigā visaranainā (||ādu||) seri ninnum̐ dalam̐suga siṁtadoḍa nuṁḍam̐gānu nīrūbu sūbidivigā nem̐ḍainānu ārīdi niṭṭūrubula nasurusurai vuṁḍam̐gā gāraviṁchi svastabĕṭṭi kaṁduva nilduvugā (||ādu||) nīgum̐gā nĕdurusūsi navvĕragai vuṁḍam̐gānu kaigŏni śhrīveṁkaḍeśha kalasidivi yīgaḍa nalamelmaṁga niḍu sevaseyam̐gā megŏni yippuḍu nannu mĕttuvugā nīvu